బంగారం కొనాలనుకుంటున్నారా.. మరి కొత్త నిబంధనల గురించి తెలుసా!

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరి కొత్త నిబంధనల గురించి తెలుసా!
BIS రిజిస్టర్డ్ జ్యువెలర్స్ అందరికీ కొత్తగా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

గోల్డ్ క్రయవిక్రయాలకు కీలక నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి తెలుసా.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS రిజిస్టర్డ్ జ్యువెలర్స్ అందరికీ కొత్తగా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇక జూన్ 1 నుంచి విక్రయించే బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లు గల బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్‌మార్క్ ఉండాల్సిందే. దీనికి అందరి ప్రయోజనాలు కాపాడినట్టు అవుతుందని అంటున్నారు. నాణ్యత విషయంలో సందేహాలకు తెరపడుతుంది. ఇప్పటి వరకు బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి నిబంధన లేదు.

15 జనవరి 2021నే హాల్‌మార్క్ నిబంధన పాటించాలని సూచించింది. జ్యువెలర్స్ అసోసియేషన్ వినతితో 2021 జూన్ 1కి పెంచారు. ఇక్కడ పరీక్షించిన తర్వాత ఎ అండ్ హెచ్ సెంటర్‌లో ఆభరణాలపై హాల్‌మార్క్‌ను ముద్రిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story