కొత్త ఎంపీసీ సభ్యులు అషిమా గోయల్‌ రాజీనామా.. ఎందుకో తెలుసా?

కొత్త ఎంపీసీ సభ్యులు అషిమా గోయల్‌ రాజీనామా.. ఎందుకో తెలుసా?

రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సభ్యులు అషిమా గోయల్‌.. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి రాజీనామా చేశారు. 2017 సెప్టెంబర్‌లో ఎకనామిక్‌ అడ్వైజరీ కమిటీ-పీఎం పునరుద్ధరించినప్పటి నుంచి అషిమా గోయల్‌ అందులో ఉన్నారు. రిజర్వుబ్యాంక్‌ చట్టం ప్రకారం ఎంపీసీ ప్యానెల్‌లోని సభ్యులెవరూ ఇతర ఆర్థిక పదవులను నిర్వర్తించకూడదు. దీంతో ఆర్‌బీఐ ఎంపీసీ కొత్త సభ్యునిగా నియమితులైన అషిమా గోయల్‌ ఇంతకు ముందు నిర్వర్తించిన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఎంపీసీ కొత్త సభ్యుని హోదాలో బుధవారం నుంచి 3 రోజుల పాటు జరిగే రిజర్వు బ్యాంక్‌ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. సమీక్ష వివరాలు అక్టోబర్‌ 9న రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించనున్నారు. అసిమా గోయల్‌తో పాటు కొత్త ఎంపీసీ సభ్యులుగా నియమితులైన శశాంక భిడే, జయంత్‌ వర్మలు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story