ఏప్రిల్ ఫస్ట్ వచ్చింది.. ఎన్నో మార్పులు తెచ్చింది.. జాగ్రత్త సుమా!

ఏప్రిల్ 1తో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. కంపెనీలకు, ఉద్యోగులకు.. ఇన్వెస్టర్లకు కొన్ని జాగ్రత్తలు అవసరం.. అవును చాలా మార్పులు రాబోతున్నాయి. ఇందులో కొన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
1. ఈ బ్యాంకుల చెక్కు బుక్‌లు పనిచేయవు
దేశవ్యాప్తంగా పలు బ్యాంకులను ప్రధాన బ్యాంకుల్లో విలీనం చేశారు. అందులో ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్ ఉన్నాయి. ఈ ఏడు బ్యాంకుల్లో ఖాతాలుంటే పాస్ పుస్తకాలు, చెక్కు బుక్కులు పనిచేయవు.
2. బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్
ఐటీఆర్‌లు దాఖలు చేయకపోతే బ్యాంకు డిపాజిట్ల నుంచి పన్ను మినహాయింపు తీసుకుంటారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుంది. అంటే ఆదాయ పన్ను శ్లాబులో లేనివారు కూడా ఐటీఆర్ దాఖలు చేయాల్సిందే లేదంటే రెట్టింపు టీడీఎస్‌ను మీ ఖాతా నుంచి కట్ అవుతుంది.
3. ఈపీఎఫ్ ఖాతాలో
ఈపీఎఫ్ ఖాతాలో పెట్టే పెట్టుబడులు ఆదాయ పన్ను కట్టాల్సిందే. ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఈపీఎఫ్‌లో పెట్టుబడులు పెడితే.. దానిపై వచ్చే వడ్డీకి పన్ను విధిస్తారు. తాజాగా ఈ పన్ను మినహాయింపు పెట్టుబడులను రూ.5 లక్షలకు పెంచారు.
4. క్రిప్టోకరెన్సీ లెక్క చెప్పాల్సిందే
తమ వద్ద ఉండే క్రిప్టోకరెన్సీ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. కంపెనీకి చెందిన ఆర్థిక అంశాలు వాటాదార్లకు తెలియాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనను తీసుకొచ్చింది. వాటిపై వచ్చిన లాభం, నష్టాలనూ వెల్లడించాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com