mobiles, tabs: ఈ వారం మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు.. ఫీచర్లు చూస్తే..

mobiles, tabs: ఈ వారం మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు.. ఫీచర్లు చూస్తే..
mobiles, tabs: చైనాకు చెందిన ఒప్పో సిరీస్‌లో భాగంగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 5, ఫైండ్ ఎక్స్ 5ప్రో మోడళ్లు ఈ వారమే విడుదల కానున్నాయి

mobiles, tabs: చేతిలో ఉన్న ఫోన్ బాగానే పని చేస్తున్నా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్ వచ్చిందంటే.. దానివైపు మనసు మళ్లుతుంది కొందరికి.. ఉన్న ఫోన్‌ని మార్చేసి లేదంటే ఎక్సేంజ్‌లో ఇచ్చేసి కొత్త ఫోన్ కొనుగోలు చేస్తుంటారు.. ఇక వినియోగదారులను ఆకర్షంచడానికి వాటికేవో కొత్త ఫీచర్లు జత చేస్తుంటారు వస్తువు సృష్టికర్తలు. అవసరాలకు అనుగుణంగా మారుతున్న టెక్నాలజీ.. మార్కెట్లోకి ఈ వారం వస్తున్న కొత్త ఫోన్లు, ట్యాబెట్ల గురించి తెలుసుకుందాం.. గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8 సిరీస్..

ఈ వారంలో గెలాక్సీ ట్యాబ్ ఎస్8, ఎస్ 8+, ఎప్ ఆల్ట్రా సిరీస్‌లను శాంసంగ్ విడుదల చేయనుంది.

ఫీచర్లు.. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ట్యాబ్ ఎస్8ను 14.6 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, ఎస్8+li 12.4 డిస్‌ప్లేతో తీసుకురానుంది. ఆల్ట్రా ఎస్8 ట్యాబ్ సిరీస్‌లు 11,200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ముందువైపు రెండు 12 మెగాఫిక్సల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఎస్-పెన్ ఫీచర్‌ను సపోర్ట్ చేసేలా వీటిని రూపిందించింది. అదేవిధంగా గెలాక్సీ ట్యాబ్ ఎస్‌8+ మోడళ్లలో 10,090 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, ట్యాబ్ ఎస్ 8 మోడళ్లలో 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉండనుంది.ఒప్పో ఫైండ్ x5 సిరీస్

చైనాకు చెందిన ఒప్పో సిరీస్‌లో భాగంగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 5, ఫైండ్ ఎక్స్ 5ప్రో మోడళ్లు ఈ వారమే విడుదల కానున్నాయి. వీటిలో స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్‌సెట్‌ను వాడారు. ఒప్పో ఫైండ్ x5 సిరీస్ మోడల్ ఫోన్లు రెండు కలర్లలో రానున్నాయి. 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో ఫైండ్ ఎక్స్5 మొబైల్స్‌ను ఒప్పో తీసుకురానుంది. వీటిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉండనున్నట్లు తెలుస్తోంది.వివో వీ23ఈ

వివో కంపెనీ ఫ్లాగ్‌షిప్ శ్రేణిలో వచ్చిన వీ23కి కొనసాగింపుగా వీ23ఈ విడుదల చేయనుంది. 6జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్లను ఉపయోగించారు. వీటి బ్యాటరీ సామర్థ్యం 4,200 ఎంఏహెచ్‌గా ఉంటుంది. కెమెరా పరంగా సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేయనున్నట్లు సమాచారం. ముందు భాగంలో 50 ఎంపీ, 98 ఎంపీ రిజల్యూషన్‌తో సెల్ఫీ కెమెరా ఉండనుంది. వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్, 2 ఎంపీ మ్యాక్రో లెన్స్ ఉండనున్నాయి.రియల్ మీ నార్జో 50

నార్జో సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను రియల్‌మీ తీసుకురానుంది. ఈ మోడళ్లను ఫిబ్రవరి 24న విడుదల చేయనుంది. రియల్‌మీ నార్జో 50 సిరీస్‌లో ఇప్పటికే 59ఐ, రియల్‌మీ నార్జో 50ఏ మోడళ్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అదిరిపోయే ఫీచర్లతో వినియోగదారుడిని ఆకట్టుకోనుంది. వీటిలో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు అప్‌గ్రేడెడ్ నైట్ ఫొటోగ్రఫీ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. రియల్ మీ నార్జో 50 సిరీస్ యూజర్లకు మంచి పనితీరుతో ముందుకు వస్తోంది. ఇందులో మీడియా టెక్ హిలియో G96 గేమింగ్ ప్రాసెసర్. అద్భుతమైన డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, దీర్ఘకాల బ్యాటరీ సామర్థ్యంతో విడుదల చేస్తున్నాం అని రియల్ మీ సంస్థ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story