RULES: అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు

RULES: అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
X
క్రెడిట్ కార్డు, యూపీఐ, బ్యాంకింగ్‌లో మార్పులు.. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం... యూపీఐలో రోజుకు 50 సార్లు బ్యాలెన్స్ చెక్

సా­ధా­ర­ణం­గా కొ­త్త నెల ప్రా­రం­భ­మ­వు­తుం­టే కొ­న్ని కొ­త్త ని­బం­ధ­న­లు అమ­లు­లో­కి వస్తుం­టా­యి. ము­ఖ్యం­గా ఆర్థిక అం­శా­ల­కు సం­బం­ధిం­చిన మా­ర్పు­లు సా­మా­న్యు­ల­పై భారం పెం­చ­వ­చ్చు. చి­న్న చి­న్న మా­ర్పు­లే మీ జె­బు­కు చి­ల్లు పె­ట్ట­వ­చ్చు. ఈ కొ­త్త మా­ర్పు­ల్లో ప్ర­ధా­నం­గా తె­లు­సు­కో­వా­ల్సిం­ది ఎల్‌­పీ­జీ గ్యా­స్ సి­లిం­డ­ర్ ధరలు. వీ­టి­తో పాటు ఈసా­రి క్రె­డి­ట్ కా­ర్డు, యూ­పీఐ, బ్యాం­కిం­గ్ సహా చాలా మా­ర్పు­లు అమ­లు­లో­కి వస్తు­న్నా­యి. నేటి(ఆగ­స్టు 1వ తేదీ) నుం­చి అమ­లు­లో­కి వస్తు­న్న కొ­త్త రూ­ల్స్ గు­రిం­చి తె­లు­సు­కుం­దాం..

గ్యాస్ సిలిండర్ ధరలు

ప్ర­తి నెల 1వ తే­దీన వంట గ్యా­స్ సి­లిం­డ­ర్ ధర­ల­ను చము­రు మా­ర్కె­టిం­గ్ సం­స్థ­లు సమీ­క్షి­స్తుం­టా­యి. గత కొ­న్ని నె­ల­లు­గా వా­ణి­జ్య సి­లిం­డ­ర్ ధర­ల్లో మా­ర్పు చే­స్తూ వచ్చా­యి. ఈసా­రి సబ్సి­డీ లి­సిం­డ­ర్ ధర­ల్లో మా­ర్పు ఉం­డ­వ­చ్చ­న్న అం­చ­నా­లు ఉన్నా­యి. నేటి నుం­చి గ్యా­స్ ధరలు తగ్గ­వ­చ్చ­ని పలు ని­వే­ది­క­లు చె­బు­తు­న్నా­యి. మరి ఎలాం­టి ని­ర్ణ­యం వె­లు­వ­డు­తుం­దో వేచి చూ­డా­ల్సిం­దే.

యూపీఐ కొత్త రూల్స్

యూపీఐ యాప్స్ ఉపయోగిస్తున్న వారికి కొత్త రూల్స్ వచ్చాయి. ఒక రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వీలుంటుంది. ఫోన్ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలను కేవలం 25 సార్లు చేక్ చేయవచ్చు. ఆటో పే వంటి సర్వీసుల ట్రాన్సాక్షన్లు మూడు స్థిర స్లాట్లలో మాత్రమే ప్రాసెస్ కానున్నాయి. ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1-5 గంటల మధ్య, రాత్రి 9.30 గంటల తర్వాత మాత్రే ప్రాసెస్ అవుతాయి. ఇక ఫెయిల్ అయిన లావాదేవీల స్టేటస్ రోజుకు మూడు సార్లు చెక్ చేయవచ్చు. రెండు ట్రాన్సాక్షన్ల మధ్య 90 సెకన్ల గ్యాప్ ఉండాలి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ క్రెడిట్ కార్డు యూజర్లకు షాకిచ్చింది. క్రెడిట్ కార్డులకు అందిస్తున్న కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సును తొలగించింది. ఆగస్టు 11వ తేదీ నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. పలు కార్డులపై ప్రస్తుతం అందిస్తున్న రూ.50 లక్షలు, రూ.1 కోటి వరకు ఉచిత విమాన ప్రమాద బీమా పాలసీలను ఆపేస్తోంది.

ట్రేడింగ్ సమయం పెంపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. కాల్ మనీ, మార్కెట్ రెపో, ట్రై పార్టీ రెపో మార్కెట్స్ వంటి వాటిల్లో ట్రేడింగ్ సమయాన్ని పెంచింది. ఆగస్టు 1 నుంచి రెండు దశల్లో ఈ మార్పు ఉండనుంది.

ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ ద్వైమాసిక సమీక్షా సమావేశం ఆగస్టు 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఈసారి కూడా రెపో రేటును భారీగా తగ్గిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రుణాలపై వడ్డీ రేట్లు భారీగా తగ్గనున్నాయి.

సీఎన్జీ, పీఎన్జీ ధరలు

చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను సమీక్షిస్తుంటాయి. అయితే ఏప్రిల్ 9 నుంచి వాటి ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ముంబైలో సీఎన్‌జీ ధర కిలోకు రూ. 79.50, పీఎన్‌జీ ధర యూనిట్‌కు రూ.49గా ఉంది. అయితే కొత్త నెలలో ధరలు మారే అవకాశం ఉంది. ఇది ప్రజా రవాణా, ఇంటి ఖర్చులను ప్రభావితం చేయనుంది. విమానాలకు శక్తినిచ్చే ఇంధనం అయిన ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలు ఆగస్టు 1న సవరించనున్నారు. ధరలు పెరిగితే, విమానయాన సంస్థలు పెరిగిన ధరను ప్రయాణికులపై భారం పడవచ్చు.

Tags

Next Story