జెట్ స్పీడుతో పెరిగిన నిఫ్టీ.. సూచీ చరిత్రలో ఫస్ట్ టైమ్

జెట్ స్పీడుతో పెరిగిన నిఫ్టీ.. సూచీ చరిత్రలో ఫస్ట్ టైమ్
2020 మార్చి తర్వాత మొత్తం 219 సెషన్లలో నిఫ్టీ 50 డబుల్ అయింది.

నిఫ్టీ 50 సరికొత్త శిఖరానికి చేరుకుంది. శుక్రవారం మార్కెట్లో 15వేల మార్కును అందుకుంది. బెటర్ కార్పొరేట్ ఏర్నింగ్స్, ఎకానమీ రికవరీ, వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా మార్కెట్లు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఇందులో భాగంగా నిఫ్టీ కూడా భారీగా పెరిగింది. 2020 మార్చి తర్వాత మొత్తం 219 సెషన్లలో నిఫ్టీ 50 డబుల్ అయింది.

24 మార్చి 2020న నిఫ్టీ 7511 వద్ద టచ్ అయింది. కోవిడ్ లాక్ డౌన్ ప్రకటనతో అత్యంత దారుణంగా పతనం అయింది. కానీ మళ్లీ రికవరీ అయింది. వేగంగానే కోలుకుంది.

జెట్ వేగంతో డబుల్ దిశగా..

7511పాయింట్లకు పడిపోయిన తర్వాత రెండు రోజులకే 8వేలకు మళ్లీ పెరిగింది. తర్వాత ఏప్రిల్ చివరి వారాల్లో 9వేల మార్కును అందుకుంది. నవంబర్లో 12000 టచ్ చేసింది. కేవలం 13 సెషన్లలో మళ్లీ 12 వేల నుంచి నవంబర్ 24 నాటికి 13వేల మార్కు అందుకుంది.

2021 ఫిబ్రవరి 1న ఇక బడ్జెట్ డే రోజు మార్కెట్ హయ్యస్ట్ మార్క్ ను అందుకుంది. 1997 బడ్జెట్ తర్వాత మళ్లీ ఇప్పడే నిఫ్టీ భారీగా పెరిగింది. అదేరోజు నిఫ్టీ 14వేల మార్కును అందుకుంది. కేవలం నాలుగు సెషన్లలోనే 1000 పాయింట్లు పెరిగి 15000 టచ్ అయింది.

కాంట్రిబ్యూటర్స్..

నిఫ్టీ 50లో అన్ని కంపెనీలు అధ్బుతంగా రికవరీ అయ్యాయి. 15వేల మార్కును అందుకోవడంలో కీలకంగా మారాయి. HDFC,RIL, Infosys, TCS, షేర్లు భారీగా పెరిగాయి. అటు నిఫ్టీ ఆటో, నిఫ్టీ బ్యాంకింగ్, నిఫ్టీ మెటల్ సూచీలు కూడా భారీగా పెరిగాయి.


Tags

Read MoreRead Less
Next Story