NIRMALA: రూపాయి పతనం ప్రయోజనమే

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయిన విషయం తెలిసిందే. డాలర్ తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 89.95గా ఉంది. రెండు రోజుల క్రితం ఈ విలువ 90కి చేరింది. సమీప భవిష్యత్తులో ఈ మారకం విలువ రూ.91కి చేరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. రూపాయి పతనం పై మాట్లాడారు. రూపాయి విలువ పెరిగేందుకు ప్రభుత్వం తరపున లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ప్రత్యేకంగా ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రూపాయి విలువను కృత్రిమంగా నియంత్రించడానికి ప్రయత్నించడం సరికాదు.. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడే డిమాండ్, సరఫరా ఆధారంగానే సరైన విలువ దొరుకుతుందని ఆమె పేర్కొన్నారు. ఇదే క్రమంలో రూపాయి పతనం పూర్తిగా ప్రతికూలమేమీ కాదని వెల్లడించారు. ఈ క్రమంలో బ్యాంకు రుణాలు ఉపకరిస్తున్నాయని చెప్పారు.
ప్రయోజనకరమే
ఈ పరిస్థితులు ఎగుమతిదారులకు ప్రయోజనకరమేనని వెల్లడించారు. రూపాయి విలువలో అధిక హెచ్చుతగ్గులు ఏర్పడి దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు, మార్కెట్‌ను స్థిరీకరించేందుకు మాత్రమే ఆర్బీఐ రంగంలోకి దిగుతుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో పోరాడుతున్నాయని, ఈ సమయంలో అన్ని దేశాల కరెన్సీలపైనా ఒత్తిడి ఉందని ఆమె చెప్పారు. ఈ గ్లోబల్ అనిశ్చితి భారత రూపాయిపై కూడా ప్రభావం చూపుతున్నప్పటికీ.. ఇతర అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి మెరుగ్గా, స్థిరంగా ఉందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. రూపాయి పతనంతో కుటుంబాల్లో పొదుపు తగ్గుతోందన్న ఆందోళనలను మంత్రి తోసిపుచ్చారు. పొదుపు, పెట్టుబడులు పెరుగుతున్నాయని వెల్లడించారు. పొదుపు మార్గాల్లో మార్పులు వస్తుండటంతో అలా అనిపిస్తుందని, కానీ వాస్తవంగా పొదుపు తగ్గడం లేదన్నారు. పైగా ఆస్తులు పెరుగుతున్నాయని తెలిపారు.
భారత్ తటస్థంగా లేదు
హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శక్తికాంత దాస్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మోదీ ప్రశంసిస్తూ, "మీ ఈ పర్యటన చాలా చరిత్రాత్మకమైనది. మీరు పదవీ బాధ్యతలు స్వీకరించి 25 సంవత్సరాలు అయింది, ఆ సమయంలోనే మొదటిసారి భారత్‌ను సందర్శించారు. మీ మొదటి పర్యటనలోనే మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాది పడింది. ఇది నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఆనందాన్ని కలిగించే విషయం. 2001లో మీరు పోషించిన పాత్ర, ఒక దార్శనిక నాయకుడు ఎలా ఆలోచిస్తాడో, ఆయన ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు, సంబంధాన్ని ఎంత దూరం తీసుకెళ్లగలరో చూపిస్తుంది. భారత్-రష్యా సంబంధాలు దీనికి ఉత్తమ ఉదాహరణ. యుక్రెయిన్ సంక్షోభంపై మోదీ మాట్లాడుతూ "యుక్రెయిన్ సంక్షోభం నుంచి మేం నిరంతరం చర్చలు జరుపుతున్నాం. మీరు కూడా, నిజమైన స్నేహితుడిలా ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. ఈ నమ్మకం మన సంబంధానికి గొప్ప బలం. శాంతికి మార్గాన్ని కనుగొనడానికి మనందరం కలిసి పనిచేయాలి. ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రయత్నాలు ప్రపంచం మళ్లీ శాంతి వైపు తిరిగి వస్తుందనే పూర్తి విశ్వాసాన్ని నాకు ఇస్తున్నాయి. భారతదేశం తటస్థంగా లేదని నేను ప్రతీసారి చెబుతున్నాను. భారత్ ఒక వైఖరిని కలిగి ఉంది, అది శాంతి కోసం. శాంతి కోసం చేసే ప్రతి ప్రయత్నానికి మేం మద్దతు ఇస్తాం. భుజం భుజం కలిపి నిలబడతాం" అని మోదీ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

