Nuskha Kitchen: గర్భిణీ స్త్రీల కోసం పోషకాల లడ్డు.. తల్లీ కొడుకుల బిజినెస్.. కోట్లలో టర్నోవర్..

Nuskha Kitchen: గర్భిణీ స్త్రీల కోసం పోషకాల లడ్డు.. తల్లీ కొడుకుల బిజినెస్.. కోట్లలో టర్నోవర్..
Nuskha Kitchen: ఆయుర్వేద వైద్యుల కుటుంబానికి చెందిన అల్పనా తివారీ "ఆయుర్వేదం తన రక్తంలో ఉంది" అని చెబుతుంది.

Nuskha Kitchen: ఆయుర్వేద వైద్యుల కుటుంబానికి చెందిన అల్పనా తివారీ "ఆయుర్వేదం తన రక్తంలో ఉంది" అని చెబుతుంది. ఆమె రాజస్థాన్.. కోటలోని మోదక్ అనే పట్టణంలో జన్మించింది. తండ్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యుడు. తండ్రి సంరక్షణలో పెరిగిన ఆమె 2019లో రూ. 20,000 పెట్టుబడితో 'నుస్కా కిచెన్‌'ను ప్రారంభించింది. 100 మంది గర్భిణీ స్త్రీలకు బలవర్ధకమైన ఆహారం తయారు చేసి అందించేది.. కొద్ది నెలల్లోనే అది 1,000 మందికి పైగా ఆర్డర్లు ఇచ్చే స్థాయికి నుస్కా కిచెన్‌ ఎదిగింది.

వివాహం చేసుకుని ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన తర్వాత, అల్పనా తన ప్రాంతంలోని ఇతర గర్భిణీలు మరియు కొత్త తల్లులకు సహాయం చేయడం ప్రారంభించింది. పోషకాహారం గురించి కానీ, సాంప్రదాయ వంటకాల గురించి కానీ వీరెవరీ తెలియదని ఆమె గుర్తించింది. గర్భం దాల్చిన మరియు డెలివరీ అయిన మహిళల కోసం పోషకమైన లడ్డూలు తయారు చేయడం ప్రారంభించింది.


గైనకాలజిస్ట్ డాక్టర్ సంతోష్ యాదవ్ ప్రేరణతో ఆమె లడ్డూలను తయారు చేయడం ప్రారంభించానని చెబుతారు. లడ్డూలు కావాలనుకునే వారు తయారీకి కావలసిన పదార్థాలను ఆమెకు ఇస్తే అల్పనా వాటిని తయారు చేసి తిరిగి ఇచ్చేవారు.

ఈ విషయం మరికొన్ని ఏరియాలకు వ్యాప్తి చెందడంతో, ఆ ప్రాంతంలోని అనేక ఇతర వైద్యులు వారి పోషకాహార అవసరాలను తీర్చడానికి వారి రోగులను తన వద్దకు పంపడం ప్రారంభించారని అల్పానా అంటారు. ఇదంతా 2009లో జరిగింది. ఇంట్లో ఇలా లడ్డూలు చేస్తున్నట్లు తన భర్తకు కూడా తెలియదు. అందరూ వెళ్లిపోయిన తరువాత లడ్డూలు తయారు చేయడం ప్రారంభించేది.

దాదాపు మూడు నాలుగేళ్ల తర్వాత తను చేస్తున్న పని గురించి కుటుంబసభ్యులకు చెప్పింది. వంటగదిలో కష్టపడి లడ్డూలు ఎందుకు తయారు చేస్తున్నావని నా భర్త ఎప్పుడూ అడిగేవాడు. కానీ నేను నా పనిని ఎప్పుడూ ఇబ్బందిగా భావించలేదు. నేను చేస్తున్న పనిని ఆస్వాదించేదానిని అని చెబుతారు అల్పానా.

నేను చేస్తున్న పనికి ప్రతి ఫలం ఆశించాలని కానీ, డబ్బు సంపాదించాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు.. నా పనిని ఓ సేవగా భావించేదానిని అని అంటారు అల్పానా.

అల్పనా వ్యాపారాన్ని నిర్వహిస్తూ, తన వంతు కృషి చేస్తున్న సమయంలో, మెకానికల్ ఇంజనీర్ అయిన ఆమె కుమారుడు విరాల్ తివారీ బెంగళూరులోని తన ఐటీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఇంటికి రావాలని నిర్ణయించుకున్నాడు. "నేను ఇందులో ఒక అవకాశాన్ని చూశాను. నేను తయారు చేస్తున్న ఉత్పత్తుల మార్కెట్‌ను అధ్యయనం చేయమని కొడుకును కోరింది.


మే 2019లో, నుస్కా కిచెన్ నిర్వహణలో తన తల్లికి సహాయం చేయాలని విరాల్ నిర్ణయించుకున్నాడు. అయితే కుటుంబసభ్యులు ఎవరూ అతడిని నిర్ణయాన్ని అంగీకరించలేదు. కానీ విరాల్ ఈ వ్యాపారంలో ఎదుగుదలకు ఆస్కారం ఉందని నమ్మి ముందడుగు వేసాడు.

మార్కెటింగ్ పనులను విరాల్ చేయడంతో, అల్పనాకు కొత్త వంటకాలను ప్రయత్నించేది. "గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను అర్ధం చేసుకుని వారి కోసం ఓట్స్ లడ్డూ, శతావరి పొడి , కొబ్బరి లడ్డూ, రాగి లడ్డూలను తయారు చేస్తాము.

నుస్కా కిచెన్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్న రిద్ధి పారిఖ్.. అల్పానా గురించి ఇలా అంటోంది. ఆమె ఉత్పత్తులు రుచికరంగా ఉంటాయి. మరొక మంచి విషయం ఏమిటంటే, ఆమె ఎల్లప్పుడూ మీతో టచ్‌లో ఉంటుంది. మీ శిశువు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుంటారు.

ఈ ఏడాది నుస్కా కిచెన్ టర్నోవర్ రూ. 2 కోట్లకు చేరుకుంది. తాను చేస్తున్న పనికి అల్పానా చాలా సంతృప్తి పడుతుంది.. ఆదాయం కంటే ఆనందం ఎక్కువగా ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన శిశువును ప్రసవించినప్పుడు అని సంతోషం వ్యక్తం చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story