Ola Uber : ఓలా ఉబర్ విలీనమవుతున్నాయా..? నిజమెంత..

Ola Uber : ఓలా ఉబర్ విలీనమవుతున్నాయా..? నిజమెంత..
Ola Uber : ఓలా ఉబర్ రెండూ మర్జ్ కాబోతున్నట్లు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

OLA Uber : దేశంలో యాప్‌ ద్వారా క్యాబ్‌బుకింగ్‌ సర్వీసులు అందిస్తున్న రెండు దిగ్గజ సంస్థలు ఓలా,ఉబర్‌ విలీనం అయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. ఓలా సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ అమెరికాలో ఉబర్‌ ఎగ్జిక్యూటివ్‌లను కలిసినట్లు కథనాలు వచ్చాయి.కొవిడ్‌ పరిణామాల ముందు ఓలా,ఉబర్‌ లు క్యాబ్‌ బుకింగ్‌ సెక్టార్‌లో రాజ్యమేలాయి.

ఆ తర్వాత పలు స్టార్టప్‌లు క్యాబ్‌ బుకింగ్‌లోకి రావడం,క్యాబ్‌ వ్యాపారంలో ఉన్న సంప్రదాయ సంస్థలు కూడా ఈ రెండు కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రయత్నించడంతో ఓలా,ఉబర్‌లకు గట్టి పోటీ ఎదురైంది. దీంతో యాప్‌ ఆధారిత టాక్సీ అగ్రిగేటర్లయిన ఓలా,ఉబర్‌ సంస్థలు మళ్లీ కష్టమర్లకు డిస్కౌంట్లు,ఇన్సెటీవ్స్‌ ఇచ్చాయి.

మరోవైపు గ్రాసరీ డెలివరీ లాంటి కొత్త సేవలనూ ఇటీవలే ప్రారంభించాయి రెండు కంపెనీలు. అయితే ఆ ప్రయత్నాలు సఫలం కాలేదన్నది మార్కెట్‌ వర్గాల అభిప్రాయం.ఈ నేపథ్యంలోనే ఉబర్‌ తన భారత వ్యాపారాల విషయంలో విక్రయం సహా అన్ని అవకాశాలనూ పరిశీలిస్తోందని గతంలోనే వార్తలు వచ్చినా వాటిని ఉబర్‌ ప్రతినిధి ఖండించారు.

ఉబర్‌,ఓలా విలీన ప్రతిపాదన వార్తను కూడా రెండు కంపెనీల ప్రతినిధులు తొసిపుచ్చారు..2013 నుంచి దేశంలో సేవలందిస్తున్న ఉబర్‌, దాదాపు 100 నగరాలకు విస్తరించింది. దీనికి గట్టి పోటీ ఓలా నుంచే ఎదురవుతోంది. బెంగళూరు, హైదరాబాద్‌లలో 500 మంది టెక్‌ సిబ్బందిని ఇటివలే ఉబర్‌ నియమించుకుంది.

ఇక ఓలా తన ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ బిజినెస్‌ ను పునర్‌వ్యవస్థీకరించుకునే క్రమంలో 1000 మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తోందన్న వార్తలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది..ఎలక్ట్రిక్‌ కార్లు, బైక్‌ లపై దృష్టి పెట్టడం కోసం సెకండ్‌ హ్యాండ్‌ కార్ల వ్యాపార విభాగమైన ఓలా కార్స్‌తో పాటు క్విక్‌ కామర్స్‌ వ్యాపార విభాగమైన ఓలా కంపెనీ మూసివేసివేసింది.

తమిళనాడులోని కృష్ణగిరి ప్లాంటులో ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ల తయారీని వారం రోజులుగా నిలిపేసింది. ప్లాంటులో నాలుగువేల స్కూటర్లు ఆమ్ముడు కాకుండా ఆగిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లకు కొత్తలో మంచి డిమాండ్ ఉంది. చాలా మంది ప్రీ బుకింగ్ కూడా చేసుకున్నారు. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కోసం ప్రారంభంలో 1.50 ల‌క్షల బుకింగ్స్ న‌మోద‌య్యాయి.

అయితే ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ ప‌నితీరులో లోపాలు,సాంకేతిక సమస్యలు ఉన్నాయన్న ఫిర్యాదుల‌తో భారీ సంఖ్యలో స్కూట‌ర్ల బుకింగ్స్ ర‌ద్దు చేసుకున్నారు కస్టమర్స్‌. రోడ్లపైకి వ‌చ్చిన వాటిలో అగ్ని ప్రమాదాలు జ‌రుగ‌డంతో కొనుగోలుదారులు వెన‌క్కు త‌గ్గారు. ఇక ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లలో అగ్ని ప్రమాదాలు, లోపాలు, సాంకేతిక సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ద‌ర్యాప్తు చేప‌ట్టింది. ఇలా అన్ని కారణాలతో సేల్స్ తగ్గినట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story