OLA: త్వరలోనే ఓలా నుంచి మరో E-స్కూటర్

OLA: త్వరలోనే ఓలా నుంచి మరో E-స్కూటర్

సిటీలో ట్రాఫిక్‌లో సౌకర్యవంతమైన బైక్ ఉండాలని కోరుకునే వారి కోసం ఓలా నూతన మోడల్‌ని ప్రవేశపెట్టనుంది. S1-ఎయిర్ పేరుతో వినియోగదారులకు అందుబాటు ధరల్లో తేనుంది. త్వరలోనే హోండా యాక్టివాతో పోటీ పడేలా 110 సీసీ సామర్థ్యంతో కూడిన e-బైక్‌ను పండగ వేళలో ప్రవేశపెట్టాలనుకుంటోంది. ఈ మోడల్ ఐడియా దశ నుంచి తయారీకి రికార్డ్ స్థాయిలో కేవలం 12 నెలలు మాత్రమే పట్టింది. దీని కోసం వినూత్నమైన ఇంజినీరింగ్‌ సాంకేతికలను ఉపయోగించింది. దీని ధరలు రూ.85000 నుంచి 1.10 లక్షల దాకా ఉండనున్నాయి

ఈ రెండు మోడళ్లు విజయవంతంగా వినియోగదారుల్ని ఆకర్షిస్తే భారత టూవీలర్స్‌ ఇండస్ట్రీలో పెను మార్పులు రానున్నాయి.


ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలు తగ్గించడంతో e-వాహనాల తయారీదారులకు కష్టకాలం మొదలైంది. వారు భారీ ఖర్చులను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఓలా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని లాభాలను కోల్పోకుండా, ఎక్కువ ప్రజలకు స్కూటర్లు చేర్చాలనే మోడల్ డిజైన్ దశ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది.

ఓలా ఇంతకు ముందు మోడళ్లలోని సెన్సార్స్, విస్తృతమైన కస్టమర్స్ ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని వినియోగదారుల అభిరుచికి నచ్చేలా S1-ఎయిర్ డిజైన్ చేసింది. S1-ఎయిర్‌ 2Kwh, 3Kwh, 4Kwh వేరియంట్లలో లభించనుంది. 2Kwh వేరియంట్‌లో 7 అంగుళాల తెర కాకుండా బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ఉండనుంది. టెలిమెట్రీ సాంకేతికత ద్వారా నియోగదారులు అప్‌డేట్స్ అందుకునే సౌకర్యం ఉంది.

అయితే ఇందులో ఉపయోగించిన హబ్ మోటార్ వల్ల గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. అయితే గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నపుడు మాత్రం వేగం లేకుండా వైబ్రేషన్స్, ఇతర శబ్ధాలు వస్తుంటాయి. అయితే ఓలా వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఓలా ద్విచక్ర వహనదారులు తక్కువ వేగంతోనే వెళ్తూ, రోజుకు 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తారని తెలిపింది. సిటీ వాహనదారులకు S1-ఎయిర్ ఉపయుక్తంగా ఉండనుంది.

ఓలా కంపెనీ తొలినాళ్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రవేశపెట్టినపుడు పలు స్కూటర్లు మంటల్లో కాలిపోయి వినియోగదారులు, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ సవాళ్లన్నింటినీ దాటుకుంటూ ఓలా ఎస్‌1, ఎస్1 ప్రో మోడళ్లను తెచ్చి వినియోగదారులను ఆకట్టుకుంది.

ఒడిదుడుకుల్లో దేశీయ కంపెనీలు..

భారత ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు తగ్గించింది. దానికి అనుగుణంగా పలు కంపెనీలు తమ మార్జిన్లను తగ్గించుకున్నాయి. జూన్ నెలలో ఎలక్ట్రిక్ వాహనాలలో ఓలా మార్కెట్‌ వాటా 40 శాతానికి పెరిగింది. ప్రత్యర్థి సంస్థలైన టీవీఎస్ మోటార్స్, ఏథర్ ఎనర్జీలతో పోటీపడుతోంది. కేవలం 12 నెలల్లోనే దీనిని తయారుచేసి మార్కెట్‌లో నూతన ఒరవడిని సృష్టించింది.


Tags

Read MoreRead Less
Next Story