మోదీ సర్కార్.. వన్ నేషన్.. వన్ హెల్త్ కార్డ్

మోదీ సర్కార్.. వన్ నేషన్.. వన్ హెల్త్ కార్డ్
కరోనా చికిత్సకు సంబంధించి హెల్త్ బీమా పాలసీల్లో స్పష్టత లేకపోవడంతో పరిహారం ఇవ్వడానికి బీమా సంస్థలు నిరాకరిందాయి. దీంతో irdai రంగంలోకి దిగింది.

One Nation One Health Card: మోదీ సర్కార్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (NDHM) ప్రారంభించింది. వన్ నేషన్, వన్ హెల్త్ కార్డ్ భారతీయులందరికీ ఆరోగ్య కార్డులను డిజిటలైజ్ చేస్తోంది. పేషెంట్ల డేటాను ఒకే కార్డులో పొందుపరుస్తారు. దీనిని ఎంచుకున్న వ్యక్తులకు ప్రత్యేకపమైన హెల్త్ ఐడీ కార్డు కేటాయించబడుతుంది.

అనారోగ్య ఇబ్బందులు తలెత్తినప్పుడు తట్టుకునేందుకు ఎన్నో బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కానీ పదుల సంఖ్యలో లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు ఉండడంతో పాటు ఒకే రకం పాలసీలోనూ వేర్వేరు నిబంధనలు.. వీటన్నింటినీ అధిగమించి ప్రతి విభాగంలోనూ ఒక ప్రామాణిక పాలసీని తీసుకురావాలని irdai పలు పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్య బీమా పాలసీల ఎంపికలో గందరగోళాన్ని తొలగించడమే దీని ప్రధాన లక్ష్యం.

కరోనా తర్వాత జీవిత, ఆరోగ్య బీమా పాలసీల అవసరాన్ని గుర్తిస్తున్నారు. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరిగింది. కానీ ఈ పాలసీలో చోటు చేసుకున్న నిబంధనలు పాలసీదారులకు ఇబ్బందిగా మారాయి. కరోనా చికిత్సకు సంబంధించి హెల్త్ బీమా పాలసీల్లో స్పష్టత లేకపోవడంతో పరిహారం ఇవ్వడానికి బీమా సంస్థలు నిరాకరిందాయి. దీంతో irdai రంగంలోకి దిగింది. కరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అన్ని బీమా సంస్థలు ఈ పాలసీలను అందిచాలను మార్గదర్శకాలు జారీ చేసింది. ఆరోగ్య సంజీవని పేరుతో మరో ప్రామాణిక ఆరోగ్య పాలసీని అందించాలని జనరల్ ఇన్సూరన్స్ కంపెనీలకు సూచించింది. గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఈ పాలసీ కింద అందించాలని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story