అరటి ఆకులు కూడా ఆన్‌లైన్లో.. ఐదు ఆకుల ధర..

అన్నీ ఆన్‌లైన్‌లో దొరికేస్తున్నాయి. ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. ధర ఎంతైనా ఫరవాలేదు.. దొరికితే అంతే చాలనుకుంటున్నారు. కస్టమర్ దేవుళ్లే తమకు కాసులు కురిపిస్తారని భావించిన వ్యాపారులు అరటి ఆకులను కూడా ఆన్‌లైన్‌లో పెట్టి బిజినెస్ చేసేస్తున్నారు. శ్రావణమాసం.. ఇళ్లలో పూజలు, వ్రతాలు, నోములు.. సందర్భం ఏదైనా అరటి ఆకులో భోజనం చేస్తే అదో తృప్తి.. ఎక్కడ దొరుకుతాయో ఎంక్వైరీ చేయడం ఎందుకు. ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి.
ఐదు అరిటాకులు ధర రూ. 50 లు అంటూ బిగ్ బాస్కెట్ అనే అస్‌లైన్ కార్పొరేట్ వ్యాపార సంస్థ తమ సైట్‌లో ఆఫర్ ప్రకటించింది. ఇక్కడ బిగ్ బాస్కెట్ వాళ్లు కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారండోయ్. ఐదు ఆకుల అసలు ధర రూ. 62.50 అయితే, 20 శాతం డిస్కౌంట్ పోనూ రూ. 50కి ఇస్తున్నామని సదరు సంస్థ ప్రకటించింది. అసలే శ్రావణ మాసం పూజలు, ఫంక్షన్ల కాలం.. దీంతో అరిటాకులకు ఆన్ లైన్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.
ఐదు అరిటాకులు రూ.50లకు విక్రయిస్తున్నారు బిగ్ బాస్కెట్ వ్యాపారులు. అసలైతే అసలు ధర రూ.62.50 అయితే 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాం.. అందుకే రూ.50లకే విక్రయిస్తున్నామంటే సంస్థ ఆఫర్ కూడా ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com