PAK: కుదేలైన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు

PAK: కుదేలైన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు
X
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం.... ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడులు

పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు చేసిన ఒక్క తప్పు ఇప్పుడు తమ దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలేలా చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణానికి దారి తీశాయి. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. అంతకు ముందే భారత్ దౌత్యపరమైన చర్యలను మొదలుపెట్టింది. 'సింధు జలాల ఒప్పందం' రద్దు చేయడం, పాకిస్థానీలకు వీసాలను రద్దు చేయడం, భారత గగనతలాన్ని పాక్ ఎయిర్‌లైనర్లకు మూసేసింది. ఇక పాక్‌తో ఉన్న వాణిజ్య సంబంధాలను భారత్ రద్దు చేసింది. ఇలా దెబ్బ మీద దెబ్బ పడడంతో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు కుదేల్‌ అయిపోయాయి.

కుప్పకూలిన కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడుల చేసిన తర్వాత ఆ దేశంలోని కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పాకిస్థాన్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ KSE-30 ఏకంగా 7,200 పాయింట్ల మేర పడిపోయింది. దీంతో నష్టాలు ఇంకా పెరుగుతాయనే భయంతో పాక్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌ నిలిపేసింది. లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లో గురువారం డ్లోన్ దాడులు జరగడం ఇన్వెస్టర్లను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. దీంతో భారీగా అమ్మకాలు జరిపారు. ఫలితంగా మార్కెట్లు కుప్పకూలాయి. రాబోయే రోజుల్లో కూడా పాక్ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులను గురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags

Next Story