గూగుల్‌కు పోటీగా పేటీఎం యాప్ స్టోర్

గూగుల్‌కు పోటీగా పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ యాప్ డెవలపర్స్ కోసం ప్రత్యేక యాండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్‌ను ప్రారంభించింది. దీనిని మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోకుండానే వినోయోగించుకోవచ్చు. మొబైల్ వెబ్‌సైట్ ద్వారానే మినీ యాప్స్ ను యాక్సెస్ చేసుకోవచ్చని, ఇందువల్ల కోట్లాది మంది యూజర్ల డేటా భద్రంగా ఉంటుందని పేటీఎం పేర్కొంది. రియల్-మనీ గేమింగ్‌పై డెవలపర్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు సెప్టెంబర్ 18 న గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎం యాప్ ని తాత్కాలికంగా తొలగించడంతో పోటీగా ఈ మినీ స్టోర్ యాప్ ను డెవలప్ చేసింది ఈ సంస్థ. డెకాథ్లాన్, ఓలా, రాపిడో, నెట్‌మెడ్స్, 1 ఎంజి, డొమినోస్ పిజ్జా, ఫ్రెష్మెను, నోబ్రోకర్ సహా 300 కి పైగా యాప్‌లు పేటీఎం
యాప్ స్టోర్‌లో చేరినట్లు కంపెనీ తెలిపింది. గత వారం స్టార్టప్ వ్యవస్థాపకులు పేటీఎం విజయ్ శేఖర్ శర్మ, రేజర్‌పేకు చెందిన హర్షిల్ మాథుర్‌తో పాటు మరో 50 మంది వ్యవస్థాపకులు గూగుల్‌ను సవాలు చేయడానికి ఇండియన్ యాప్ స్టోర్ నిర్మించే అవకాశంపై చర్చించారు. కాగా గూగుల్ ప్లేస్టోర్ బిల్లింగ్ సిస్టమ్ ద్వారా పేమెంట్ చేస్తే 30 శాతం కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే పేటీఎం అందుబాటులోకి తెచ్చిన ఈ మినీ యాప్ స్టోర్ పేమెంట్ గేట్ ద్వారా యాప్స్ లిస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ సేవలను చార్జీలు లేకుండా అందించనున్నట్టు ఆన్ లైన్ చెల్లింపుల దిగ్గజ సంస్థ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com