వ్యాపారస్తులకు పేటీఎం గుడ్ న్యూస్..

వ్యాపారస్తులకు పేటీఎం గుడ్ న్యూస్..
ఇది వ్యాపారస్తులకు లాభం చేకూర్చేదిగా ఉంటుందని భావిస్తోంది.

ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం.. వ్యాపారస్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వారు చేసే అన్ని లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పేటీఎం, వ్యాలెట్, యూపీఐ యాప్స్, రూపే కార్డుల ద్వారా చేసే పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని తెలిపింది. ఇది వ్యాపారస్తులకు లాభం చేకూర్చేదిగా ఉంటుందని భావిస్తోంది.

పేటీఎం ఆల్‌ఇన్ వన్ క్యూఆర్, పేటీఎం సౌండ్ బాక్స్, పేటీఎం ఆల్ ఇన్ వన్ ఆండ్రాయిడ్ పీవోఎస్ వాడుతున్న సుమారు 1.7 కోట్ల మంది వ్యాపారులకు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనుందని పేటీఎం తెలిపింది. అంతేకాకుండా ఇది డిజిటల్ పేమెంట్స్ దిశగా వ్యాపారులను ప్రోత్సహించడంతో పాటు, డిజిటల్ ఇండియా కలను నిజం చేసేందుకు తోడ్పడుతుందని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ ఆదిత్య తెలిపారు.

సూక్ష్మ, చిన్న మధ్య తరహా వ్యాపార వర్గాలను ప్రోత్సహించేందుకు రూ.600 కోట్ల మేర ఏండీఆర్ ఛార్జీల భారాన్ని పేటీఎం భరిస్తుందని తెలిపారు. అలాగే పేమెంట్స్‌ను నేరుగా పేటీఎం వ్యాలెట్‌కు లేదా తమ బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేసుకునే వెసులుబాటును వ్యాపారులకే కల్పిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎంఎస్ఎంఈలకు రూ.1000 కోట్ల మేర రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేటీఎం ప్రకటనలో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story