Petrol and diesel prices : తగ్గేదే.. లే.. మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

X
By - /TV5 Digital Team |21 Oct 2021 7:30 AM IST
Petrol and diesel prices: ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోవడం లేదు పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవ్వాళ మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగాయి.
Petrol and diesel prices: ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోవడం లేదు పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవ్వాళ మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగాయి. దీనితో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.19గా, డీజిల్ ధర రూ.94.92కు ఎగబాకింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.112.11కి, డీజిల్ ధర రూ.109.04గా చేరింది. ఇక హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.92, డీజిల్ ధర రూ. 103.91కు చేరింది. ఇక విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.113, డీజిల్ ధర రూ.105.55గా ఉంది. సెప్టెంబర్ 5 తర్వాత డీజిల్ ధర.. రూ.6.85, పెట్రోల్ ధర రూ. 5.35 మేర పెరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com