Petrol and Diesel Rates : మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 20వ సారి.. !

Petrol and Diesel Rates : మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 20వ సారి.. !
Petrol and Diesel Rates : మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీట‌రు పెట్రోల్‌ పైన రూ. 35 పైసలు, లీట‌రు డీజిల్ పైన రూ. 38 పైసలు పెరిగాయి.

Petrol and Diesel Rates : మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీట‌రు పెట్రోల్‌ పైన రూ. 35 పైసలు, లీట‌రు డీజిల్ పైన రూ. 38 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 113కు చేరుకుంది. డీజిల్ ధ‌ర రూ. 106.22కు ఎగబాకింది. ఇక గుంటూరులో పెట్రోల్ ధర రూ. 115.03, డీజిల్ ధర రూ. 107.48గా ఉంది. అటు ఢిల్లీలో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.108.64కు చేర‌గా, డీజిల్ ధ‌ర రూ.97.37కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ రూ.114.47, డీజిల్ రూ.105.49గా ఉంది. కేవలం ఈ ఒక్క నెలలోనే పెట్రోల్ రేట్లను 20 సార్లు పెంచారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల దృష్ట్యా వాహనదారులు బండి బయటకు తీయాలంటే బయపడుతున్నారు. సామాన్యుడు తన రోజువారీ సంపాద‌న‌లో అధిక‌భాగం పెట్రోల్‌, డీజిల్‌కే వెచ్చించాల్సి వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story