మండుతున్న పెట్రోల్ ధరలు.. లీటర్..

మండుతున్న పెట్రోల్ ధరలు.. లీటర్..
దేశీయ అతిపెద్ద ఇంధన రిటైల్ సంస్థ ఇండియన ఆయిల్ కార్పొరేషన్ ధరల ప్రకారం.

దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. వాహన దారుల జేబులు ఖాళీ అవుతున్నాయి. సోమవారం పెట్రోల్ ధర లీటర్‌పై 25 పైసలు, డీజిల్ ధర 25 పైసల చొప్పున పెరిగింది. దీంతో ఇంధన ధరలు దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.84.95కు చేరింది. డీజిల్ ధర రూ.75.13గా ఉంది. దేశీయ అతిపెద్ద ఇంధన రిటైల్ సంస్థ ఇండియన ఆయిల్ కార్పొరేషన్ ధరల ప్రకారం.. పెట్రోల్ ధర ముంబయిలో అత్యధికంగా రూ.91.56గా ఉంది. చెన్నలో రూ.80.43, కోల్‌కతాలో రూ.78.72గా ఉంది.

హైదరాబాద్‌ నగరంలో అత్యధికంగా సోమవారం పెట్రోల్ ధర లీటర్‌పై 26 పైసలు పెరిగింది. దీంతో లీటర్ ధర 88.37కు చేరింది. డీజిల్ ధర 26 పైసలు పెరిగి రూ.81.99గా ఉంది. ప్రధాన నగరాలతో పోలిస్తే డీజిల్ ధర హైదరాబాదులోనే అత్యధికంగా ఉండడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story