మెట్రో నగరాల్లో పెట్రో మోత..

రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రో దరలు ఈ రోజు పైకి కదిలాయి. పెట్రోల్ ధర 27 పైసలు, డీజిల్ ధర 27 పైసల చొప్పున పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో శుక్రవారం పెట్రోల్ ధర రూ.88.90కు, డీజిల్ ధర రూ.82.53కు చేరింది.
అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. అక్కడ రూ.25 పైసలు పెరిగి రూ.91.68కి చేరుకుంది. డీజిల్ ధర 26 పైసలు పెరిగి రూ.84.84కు చేరుకుంది. ఇక విజయవాడలోనూ ధరల పరిస్థితి ఇలాగే ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.85.45కు చేరింది. డీజిల్ ధర రూ.75.63కు చేరుకుంది. ముంబైలో 24పైసలు పెరిగిన పెట్రోల్ లీటర్ ధర రూ.92.04కు చేరింది. డీజిల్ ధర 27 పైసలు పెరిగి రూ.82.40కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.09 శాతం తగ్గుదలతో 55.50 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.19 శాతం క్షీణతతో 52.51 డాలర్లకు తగ్గింది.
పెట్రో, డీజిల్ ధరల్లో ప్రతి రోజూ మార్పు ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com