2021 బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

2021 బడ్జెట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. 2021 బడ్జెట్‌పై భారీ ఆశలు, అంచనాలు ఉన్నాయి. కరోనా తరువాత వస్తున్న బడ్జెట్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆత్మనిర్భర్ పేరుతో కార్పొరేట్ రంగానికి 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో అయినా ఊరటనిస్తారా లేదా అని సామాన్యులు ఎదురుచూస్తున్నారు.
కరోనా కారణంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగింది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నారు. మరోవైపు, ఆదాయపన్ను మినహాయింపులు పెంచాలని వేతనజీవులు కోరుతున్నారు. కరోనా సృష్టించిన భయాల కారణంగా.. అందరికీ వైద్య సేవలు, ఆరోగ్య బీమా తప్పనిసరిగా కనిపిస్తోంది. తక్కువ ప్రీమియంతో హెల్త్ ఇన్సూరెన్స్ స్కీములు ప్రకటించాలని, అందరికీ వైద్యం అందేలా పథకాన్ని ప్రవేశపెట్టాలని ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com