Post Office Scheme: పోస్టాఫీస్ పథకం.. రోజుకు రూ.333లు పెట్టుబడి.. పదేళ్లలో రూ.16 లక్షల పైనే..

Post Office Scheme: పోస్టాఫీస్ పథకం.. రోజుకు రూ.333లు పెట్టుబడి.. పదేళ్లలో రూ.16 లక్షల పైనే..
Post Office Scheme: కష్టపడి సంపాదించిన సొమ్ము ఎక్కడ పెట్టుబడి పెడితే మనకు భద్రత లభిస్తుంది అని ఆలోచిస్తుంటారు కొంత మంది. అలాంటి వారికోసం పోస్టా‌ఫీస్ ఆర్‌డి భద్రతనిచ్చే స్కీమ్.

Post Office Scheme: పోస్టాఫీస్ పథకాల్లో చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టినా అధిక వడ్డీ వస్తుంది. తక్కువ రిస్క్‌తో మంచి రాబడి సంపాదించడానికి పోస్టాఫీస్ పథకాలు అనేకం ఉన్నాయి. రిస్క్ తక్కువ లాభం ఎక్కువ ఉండే కొన్ని పోస్టాఫీస్ పథకాల్లో రికరింగ్ డిపాజిట్ (RD) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిని రూ.100లతో కూడా ప్రారంభించవచ్చు. గరిష్టంగా పరిమితి లేదు.

RD డిపాజిట్ ఖాతా ఐదేళ్లపాటు తెరవబడుతుంది. బ్యాంకులు ఆరు నెలలు, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలకు రికరింగ్ డిపాజిట్ ఖాతాలను అందజేస్తాయి. ప్రతి త్రైమాసికంలో అందులో డిపాజిట్ చేసిన డబ్బుపై వడ్డీ లెక్కించబడుతుంది. త్రైమాసికం ముగిసిన తరువాత అది మీ ఖాతాలో చక్రవడ్డీతో సహా జమ చేయబడుతుంది.

RD డిపాజిట్ మీద ఎంత వడ్డీ వస్తుంది..

ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్ పథకాలు 5.8% వడ్డీ రేటును పొందుతున్నాయి. ప్రతి త్రైమాసికంలో, కేంద్ర ప్రభుత్వం తన పొదుపు కార్యక్రమాలన్నింటికీ వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌ పథకంలో ప్రతి రోజు రూ.333 లు అంటే నెలకు రూ.10 వేలు పెట్టుబడి 10 సంవత్సరాలు పెడితే 5.8% వడ్డీ లెక్కకడితే దాదాపు రూ.16 లక్షలు పైన వస్తాయి.

ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి

వడ్డీ 5.8%

మెచ్యూరిటీ 10 సంవత్సరాలు

10 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ మొత్తం: రూ.16,28,963

Tags

Read MoreRead Less
Next Story