Post Office Savings Account: సేవింగ్స్ అకౌంట్ ఛార్జీల్లో మార్పులు..

Post Office Savings Account: ఎన్ని కొత్త పద్ధతుల్లో సేవింగ్స్ అమల్లోకి వచ్చినా పోస్టాఫీస్‌లో డబ్బులు దాచుకునే పాత పద్ధతిని ఇంకా కొంతమంది పాటిస్తూనే ఉన్నారు. అలాగే మీకు కూడా పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఈరోజు నుండి మారనున్న రూల్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే.. పోస్టాఫీస్‌లో ఏటీఎమ్ వినియోగంతో పాటు ఇతర సేవల ఛార్జీల్లో మార్పులు జరిగాయి.
అక్టోబర్ 1 నుండి పోస్టాఫీస్ ఏటీఎమ్ మెయింటెయిన్స్ ఛార్జీలో మార్పులు జరగనున్నాయి. ఇప్పటినుండి దానికి రూ. 125+ జీఎస్‌టీని వసూలు చేయనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ వరకు ఇవే ఛార్జీలు కొనసాగనున్నాయి. ఎస్ఎమ్ఎస్ అలెర్ట్ కోసం రూ. 12+ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఖాతాలో కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోతే రూ. 20 + జీఎస్‌టీ కట్టవలసి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com