2025లో ఐపీఓకు ప్యూర్ ఇవి..నాలుగేళ్లలో రూ.2 వేలకోట్ల టర్నోవర్ లక్ష్యం

ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో ప్యూర్ ఈవీ మోటార్ సైకిల్స్ ది హవా నడుస్తోంది. వచ్చే ఐదేళ్లల్లో పెను సంచలనంగా మారనుంది. ఇండియాలో బైక్స్ అమ్మకాల్లో 65% వాటా ప్యూర్ ఈవీ మోటార్‌సైకిళ్లదే కావడం విశేషం. దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాలలో ప్యూర్ ఈవీ తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే తమ ఉత్పత్తులను దక్షిణాసియాకు ఎగుమతి చేయడంతో పాటుగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా మార్కెట్‌లకు సైతం విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం 2 వాట్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సెగ్మెంట్లో ప్యూర్ ఈవీ( ఈవ్ ) అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది.
ప్యూర్ ఈవీ సంస్థను 2019లో ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థులైన నిశాంత్ దంగోరి, రోహిత్ వడేరాలు స్థాపించారు. ప్రముఖ సంస్థలు చాలానే ఇందులో పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 201 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ ప్లూటో 7G మాక్స్, ఎంట్రెన్స్ నియో ప్లస్, ఈటైరిస్ట్ ఎక్స్, ఈకో డ్రిఫ్ట్ వంటి ప్రముఖ మోడల్స్ ఉన్నాయి.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్ విభాగంలో రీజనల్ స్థాయిలో 7 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్న ప్యూర్ ఈవీ.. త్వరలో టైర్-1, టైర్- 2 నగరాలన్నింటికి పరిధిని విస్తరించాలనుకుంటున్నట్లు తెలిపింది. కంపెనీ వినూత్న ఆఫర్లు.. దూకుడైన మార్కెటింగ్, బ్రాండింగ్ వ్యూహాలతో డీలర్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉందని ఆ సంస్థ సంస్థ సీఈఓ రోహిత్ వడేరా వివరించారు. వచ్చే 4 సంవత్సరాల్లో టర్నోవర్ టార్గెట్ రూ. 2 వేల కోట్లుగా పెట్టుకున్నట్లు చెప్పారు. టర్నోవర్ పెరగడంతో దానికి అనుగుణంగా లాభాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.
ఐపీఓ ప్లాన్స్ గురించి రోహిత్ వడేరా మాట్లాడారు. 2025లో భారత ఎలక్ట్రానిక్ విప్లవంలో భాగస్వామ్యం అవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తమ వాటా పెంచుకుంటామని భవిష్యత్తు ప్యూర్ ఈవీదేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాము వినియోగించే వినూత్న ఏఐ ఆధారిత సాంకేతికత, సామర్థ్యం, పనితీరుపై దృష్టి సారించిన క్రమంలో మోటార్ సైకిల్ సెగ్మెంట్లో గణనీయమైన పురోగతి సాధిస్తామని అన్నారు రోహిత్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com