హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఏం జరుగుతోంది..?

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతటినీ ఆడిట్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా ఓ స్వతంత్ర సంస్థని నియమించింది. ఈ మేరకు స్వయంగా బ్యాంక్ వర్గాలే ప్రకటించాయ్. దీంతోపాటు ఈ బ్యాంక్‌కి సంబంధించిన డిజిటల్ ఇనిషియేటివ్స్, క్రెడిట్ కార్డ్ ఇష్యూయెన్స్ కూడా ఫ్రీజ్ చేసింది ఆర్బీఐ. ఈ ఆడిట్ పూర్తయ్యేంతవరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.
2018 నుంచి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి సంబంధించిన డిజిటల్ లావాదేవీల విషయంలో కనీసం మూడుసార్లు గందరగోళం నెలకొంది. దీంతో ఆర్బీఐ ఈ విషయంపై దృష్టి సారించింది. స్వయంగా అర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మాట్లాడుతూ..బ్యాంకులకు సంబంధించిన ఈ టెక్నికల్ అంశాలు,కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీరియస్‌గా తీసుకోవాలని కోరారు.ఈ నేపథ్యంలోనే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఔట్‌సైడ్ సంస్థతో ఐటీ ఆడిట్ జరుగుతోంది.
ఈ ఏడాది జనవరి 16న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీఎఫ్ఓ శ్రీనివాసన్ వైద్యనాథన్, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలతో పాటు, తమ బ్యాంక్‌లో జరిగే ఆడిట్‌కి సహకరిస్తామని ప్రకటించారు. ఇది ఒకటే కాకుండా స్వయంగా తమ బ్యాంక్ కూడా టెక్నాలజీకి సంబంధించిన అప్‌గ్రేడ్, డిజాస్టర్ సొల్యూషన్స్ విషయంలో చర్యలు తీసుకుంటున్నట్లు ఇవి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం తీసుకుంటాయని చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com