RBI: ఆర్బీఐ గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకున్న వారికి ఊరట..

RBI: ఆర్బీఐ గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకున్న వారికి ఊరట..
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ తీసుకున్న వారికి తాజాగా తీపి కబురు అందించింది. రుణ గ్రహీతలకు ఊరట కలిగించే విషయాన్ని తెలిపింది. హోమ్ లోన్ లిమిట్ ను పెంచింది.

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ తీసుకున్న వారికి తాజాగా తీపి కబురు అందించింది. రుణ గ్రహీతలకు ఊరట కలిగించే విషయాన్ని తెలిపింది. హోమ్ లోన్ లిమిట్ ను పెంచింది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ జారీ చేసిన హోమ్ లోన్స్ పరిమితిని రెట్టింపు చేసింది. దీనివల్ల టైర్ 1 అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులు రూ.60 లక్షల వరకు హౌసింగ్ లోన్స్ ను జారీ చేయవచ్చు. అలాగే టైర్ 2 బ్యాంకులు రూ.1.4 కోట్ల వరకు లోన్ ఇవ్వొచ్చు. ఆర్భీఐ ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. చివరిగా ఈ లెండింగ్ లిమిట్స్ ను 2011లో సవరించారు.. మళ్లీ ఇప్పుడు ఈ పరిమితులను పెంచారు.

పెరుగుతున్న ఇళ్ల ధరలను, కస్టమర్ల అవసరాలను పరిగణలోకి తీసుకొని హౌసింగ్ లోన్ పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకులకు సంబంధించిన రుణ నిబంధనలను కూడా ఆర్బీఐ సవరించింది. సర్క్యులర్ ప్రకారం ఆర్బీఐ గ్రూప్ రుణాల పరిమితిని కోఆపరేటివ్ బ్యాంకుల టైర్ 1 మూలధనంలో 40 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. అలాగే ఈ బ్యాంకులు ఒకే రుణ గ్రహీతకు టైర్ 1 క్యాపిటల్ లో 15 శాతం వరకు మాత్రమే రుణాలు అందించాలి. ఎక్కువ ఇవ్వకూడదు. అలాగే హౌసింగ్, రియల్ ఎస్టేట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ రుణాలకు సంబంధించి కోపరేటివ్ బ్యాంకులు వాటి మొత్తం ఆస్తులలో 10 శాతానికి మించి రుణాలు ఇవ్వకూడదు.

అంతే కాకుండా అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు హోమ్ లోన్స్ పై పలు రకాల చార్జీలను వసూలు చేయకూడదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. హోమ్ లోన్స్ పై ప్రీ పేమెంట్ పెనాల్టీలు, ఫోర్ క్లోజర్ చార్జీలు తీసుకోకూడదని పేర్కొంది. అంతేకాకుండా అర్బన్ కోపరేటివ్ బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుంటే దాన్ని 20 ఏళ్లలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే లోన్ టెన్యూర్‌ను 20 ఏళ్ల వరకు పెట్టుకోవచ్చు. రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వొచ్చని అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు అనుమతులు ఇచ్చింది. హౌసింగ్ రంగానికి క్రెడిట్ ఫ్లో పెంచాలనే లక్ష్యంతో ఆర్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story