RBL బ్యాంకుకు షాకిచ్చిన RBI

నిబంధనలు ఉల్లంఘించినట్టు నిర్దారణ కావడంతో RBL బ్యాంకుపై కొరఢా ఝులిపించింది RBI. చట్ట విరుద్దంగా ఖాతాలు తెరిచినట్టు తమ పరిశీలనలో తేలినట్టు ప్రకటించింది. మార్చి 31, 2019న ఇన్స్పెక్షన్ ఆఫ్ సూపర వైజరీ ఎవాల్యూయేషన్ ISEలో బ్యాంకు అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించింది.
ఆర్‌బిఐ బ్యాంక్ రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్ మరియు ఐఎస్‌ఇ 2019 పరిశీలనలో కో ఆపరేటీవ్ పేరిట ఐదు సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్లు తెరవడంలో బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఆదేశాలు మరియు 1949 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. బ్యాంక్ మరియు డైరెక్టర్ల బోర్డు విషయంలో చట్టంలోని సెక్షన్ 10A (2) (b) నిబంధనలను పాటించడంలో వైఫల్యం చెందినట్టు RBI గుర్తించింది. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు మరియు పాటించనందుకు ఎందుకు పెనాల్టీ విధించకూడదో కారణాన్ని చూపించమని బ్యాంకుకు ఆర్‌బిఐ నోటీసు జారీ చేసింది.
బ్యాంకుపై లిక్విడ్ జరిమానా విధించింది. సెక్షన్ 47 A (1) (సి) సెక్షన్ సెక్షన్ 46 (4) (i) తో చదివిన నిబంధనల ప్రకారం జరిమానా విధించినట్లు RBI తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com