RBI Repo Rate: మరోసారి రెపోరేటు పెంచేసిన RBI.. అనుకున్నదానికంటే ఎక్కువగానే..

RBI Repo Rate: ఊహించినట్లుగానే రెపోరేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.40 శాతానికి చేర్చినట్లు ప్రకటించింది. పరిశ్రమ వర్గాలు అంచనా వేసినట్లు 35 బేసిస్ పాయింట్లు కాకుండా ఆర్‌బీఐ మరింత అధికంగా పెంచేసింది. కొవిడ్ సంక్షోభం తర్వాత ఆర్‌బీఐ వరుసగా మూడోసారి రెపోరేటును పెంచింది.
మేలో 40 బేసిస్ పాయింట్లు, జూన్‌లో మరో 50 పాయింట్లు, తాజాగా ఇపుడో 50 బేసిస్ పాయింట్లు వడ్డించారు. భారాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు వెంటనే బదలాయించాయి. మార్పును ముందే అంచనా వేసిన కొన్ని బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించేశాయి. దీంతో హోమ్, కారు లోన్ సహా ఇతర రుణాల EMI మరింత భారం కానుంది. ముందే చెప్పినట్లు ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకే రెపోరేటు పెంచుతున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com