మారిటోరియం పెంపు లేనట్టే?

కొవిడ్ పేండమిక్ నుంచి వ్యక్తులను, సంస్థలను ఆదుకునేందుకు బ్యాంకు రుణాల EMI చెల్లింపులపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మారిటోరియం విధించింది. ముందుగా మార్చి నుంచి మే నెల వరకు మారిటోరియం అమలు చేశారు. అయితే తీవ్రత తగ్గకపోగా... మరింత విస్తరిస్తుండటంతో ఆగస్టు 31వరకు అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఈ గడువు కూడా ఈ నెలతో ముగుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇంకా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జరగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో మారిటోరియం పొడగిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలున్నాయి. HDFC ఛైర్మన్ దీపక్ పరేక్, కోటక్ మహీంద్రా ఎండీ ఉదయ్ కోటక్ ఇప్పటికే అభ్యంతరాలు తెలుపుతూ రిజర్వు బ్యాంకుకు లేఖలు రాశారు. మారిటోరియం ఎక్కువకాలం ఉంచడం వల్ల పేమెంట్ హాబిట్ మార్పు వస్తుందని... ఇది అంతిమంగా బ్యాంకుల్లో NPAలకు కారణమవుతుందని అభిప్రాయపడ్డారు.
అయితే ఇటీవల RBI ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మారిటోరియం అనేది స్వల్పకాలికంగా ఊరట మాత్రమేనని.. కొంతకాలం పాటు వారికి రిలీఫ్ ఉండేలా ఆలోచనలు చేస్తున్నామని ప్రకటించింది RBI. ఇప్పటికే కంపెనీలకు రుణాల రీస్ట్రక్చర్ ప్లాన్ అమలు చేస్తోంది. త్వరలో వ్యక్తిగత రుణాలపైనా కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే మారిటోరియం కాకుండా.. ఇతర మార్గాల్లో వారికి అటు బ్యాంకులు, ఇటు ఖాతాదారులకు ఇరువురికి నష్టం లేకుండా కొత్త స్కీము వచ్చే అవకాశం ఉంది. మారిటోరియం కొనసాగించే ఉద్దేశం RBI కి లేదని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com