కీలక వడ్డీరేట్లు యధాతథంగా ఉంచిన RBI

కీలక వడ్డీరేట్లు యధాతథంగా ఉంచిన RBI
ఆర్థిక వృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు శక్తికాంత్‌దాస్‌ స్పష్టం చేశారు.

కీలక వడ్డీరేట్లను యధాతథంగానే ఉంచింది RBI. ద్రవ్యపరపతి సమీక్ష వివరాల్ని ప్రకటించిన శక్తికాంత్‌దాస్‌ ఈ ఏడాది వృద్ధిరేటు మెరుగ్గానే ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఉన్న రెపో రేటు 4 శాతాన్ని.. రివర్స్ రెపో రేటు 3.35 శాతాన్ని అలాగే కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆశాజనకంగా సాగుతోన్న నేపథ్యంలో.. ఆర్థిక వృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు శక్తికాంత్‌దాస్‌ స్పష్టం చేశారు. 2021-22లో జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతంగా అంచనా వేశారు.


Tags

Read MoreRead Less
Next Story