హెచ్‌డిఎఫ్‌సిపై ఆర్‌బిఐ ఆంక్షలు కంటిన్యూ?

హెచ్‌డిఎఫ్‌సిపై ఆర్‌బిఐ ఆంక్షలు కంటిన్యూ?
కొత్త క్రెడిట్ కార్డుల జారీ చేయకుండా గత నెలలో ఆంక్షలు విధించగా..అవి మరి కొన్ని రోజులు కొనసాగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుపై గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షలు మరి కొన్నాళ్లు కొనసాగే సూచనలు కన్పిస్తున్నాయ్. కొత్త క్రెడిట్ కార్డుల జారీ చేయకుండా గత నెలలో ఆంక్షలు విధించగా, ఆ సమస్యలు ఇంకా పరిష్కరించబడకపోవడంతో.. అవి మరి కొన్ని రోజులు కొనసాగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

ఆర్బీఐ అప్పాయింట్ చేసిన కమిటీ కూడా బ్యాంకుకి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. సాంకేతిక లోపాలు తరచూ తలెత్తుతుండటంపై యూజర్లు ఈ మధ్యనే సోషల్ ‌మీడియాలో ట్రోలింగ్‌కి దిగారు, బ్యాంక్ యాజమాన్యం ఎంతగా ప్రయత్నించామని చెప్పినా, ఇలాంటి లోపాలు ఎందుకు తలెత్తుతున్నాయనే అంశంపై ఆర్బీఐ నియమించిన కమిటీ రిపోర్ట్ కీలకంగా మారింది.

మామూలుగానైతే, జూన్ 2021 నాటికి హెచ్‌డి‌‍ఎఫ్‌సి బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు రద్దు చేస్తారని భావించారు. ఐతే అది మరి కొన్నాళ్లు కొనసాగనుండటం బ్యాంక్‌కి ఆర్థికంగా నష్టం చేకూర్చుతోంది. పేమెంట్స్ మార్కెట్‌లో Hdfcకి 35-40శాతం వాటా ఉంది. కరోనా తలెత్తకముందు, ప్రతి నెలా బ్యాంక్, రెండులక్షల క్రెడిట్ కార్డులు ఇష్యూ చేసేది. అలాంటిది ఆరు నెలలపాటు కొత్త కార్డుల జారీ నిలిచిపోవడం ఆ విభాగం నుంచి వచ్చే ఆదాయానికి నీళ్లొదొలుకున్నట్లే భావించాలి.

Tags

Read MoreRead Less
Next Story