REAL ESTATE: రియల్ ఎస్టేట్‌కు పండగే

REAL ESTATE: రియల్ ఎస్టేట్‌కు పండగే
X
కలిసొచ్చిన స్థిరమైన వడ్డీ రేట్లు, జీఎస్టీ తగ్గింపులు.. 25–30 శాతం పెరగనున్న అమ్మకాలు.. ఏడాదిన్నరగా పడిపోయిన రియల్ ఎస్టేట్‌కు బూస్ట్.. తగ్గుముఖం పట్టిన ఇళ్ల ధరలు

పండగ అంటే ప్ర­తి ఇంటా సం­బ­రం, మా­ర్కె­ట్ల­లో కళకళ! తె­లు­గు రా­ష్ట్రా­ల్లో వి­నా­యక చవి­తి­తో మొ­ద­లై, హోలీ వరకూ సాగే ఈ పండగ సీ­జ­న్‌ స్థి­రా­స్తి రం­గా­ని­కి కూడా ఒక వరం లాం­టి­ది. ఈసా­రి, కేం­ద్ర ప్ర­భు­త్వం తీ­సు­కొ­చ్చిన వస్తు సేవల పన్ను (జీ­ఎ­స్టీ) సం­స్క­ర­ణ­లు, రి­జ­ర్వ్ బ్యాం­క్ ఆఫ్ ఇం­డి­యా (ఆర్‌­బీఐ) వడ్డీ రే­ట్ల­ను స్థి­రం­గా ఉం­చ­డం వంటి అను­కూల ని­ర్ణ­యా­ల­తో ఈ పండగ సీ­జ­న్‌ కొ­ను­గో­లు­దా­రు­ల­కు డబు­ల్ ధమా­కా­గా మా­రిం­ది. ఫలి­తం­గా, 2025 ఫె­స్టి­వ­ల్ సీ­జ­న్‌­లో స్థి­రా­స్తి వి­క్ర­యా­లు 25–30 శాతం పె­రి­గే అవ­కా­శం ఉం­ద­ని ని­పు­ణు­లు అం­చ­నా వే­స్తు­న్నా­రు. దీం­తో డె­వ­ల­ప­ర్ల­లో నూతన ఉత్సా­హం నె­ల­కొం­ది, కొ­ను­గో­లు­దా­రు­ల­కు ఇది సొం­తిం­టి కలను సా­కా­రం చే­సు­కు­నే గొ­ప్ప అవ­కా­శం­గా మా­ర­నుం­ది.

ఎందుకు ఈ సీజన్‌ స్పెషల్?

గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది గృహ రుణాలపై వడ్డీ రేట్లు కొంత తగ్గుముఖం పట్టాయి. జీఎస్టీ రేట్ల సంస్కరణలతో కొనుగోలు ఖర్చు కూడా తగ్గింది. ఉదాహరణకు, అండర్-కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గింది, ఇది కొనుగోలుదారులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది. అదనంగా, ఆర్‌బీఐ రెపో రేటును 5.5% వద్ద స్థిరంగా ఉంచడంతో గృహ రుణ వడ్డీ రేట్లు 8.5–9% రేంజ్‌లో ఉన్నాయి, ఇవి గత రెండేళ్ల కనిష్ట స్థాయిలో ఉన్నాయి. ఈ రెండు అంశాలు కలిసి, స్థిరాస్తి మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచుతున్నాయి.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ట్రెండ్స్

గత ఏడాదిన్నరగా హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు కొంత నీరసంగా ఉన్నాయి. కోవిడ్ తర్వాత మార్కెట్ స్లో డౌన్, ధరలు ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో కొనుగోలుదారులు ఆచితూచి అడుగులు వేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చేస్తున్న ప్రయత్నాలు.. మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్), స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు—కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ అభివృద్ధి కారణంగా హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోంది.ముఖ్యంగా, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపొలిస్, శంషాబాద్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు కొనుగోలుదారుల రాడార్‌లో ఉన్నాయి. ఈ ఏరియాల్లో ఫ్లాట్లు, విల్లాల సంఖ్య పరిమితంగా ఉండటంతో, ఇప్పుడు కొనకపోతే భవిష్యత్తులో కొనలేమేమో అనే ఆలోచన కొనుగోలుదారుల్లో నెలకొంది. కోకాపేట, నియోపొలిస్‌లో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పుడల్లా బుకింగ్‌లు వేగంగా జరుగుతున్నాయి. ఐటీ కారిడార్ సమీపంలో ఉండటం, మెట్రో కనెక్టివిటీ వంటి అంశాలు ఈ ప్రాంతాలను ఆకర్షణీయంగా మార్చాయి.

Tags

Next Story