ఇల్లు కొనేందుకు ఇదే సరైన సమయం..: మార్కెట్ నిపుణుల అభిప్రాయం

ఉద్యోగ భద్రత, లోన్ పీరియడ్, ఆర్థిక అవసరాలు, అన్నీ దృష్టిలో ఉంచుకుని ఇల్లు తీసుకునే విషయమై ఆలోచించాలి. కోవిడ్ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించినా గత కొద్ది రోజులుగా మార్కెట్ పుంజుకుంది. రియల్టర్ నిపుణులు కూడా ఇల్లు కొనుగోలుకు ఇదే సరైన సమయమని అంటున్నారు. భూముల ధరలు పెరిగినా ఇప్పటికీ హైదరాబాద్‌లో, చుట్టుపక్కల జిల్లాల్లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి.
2021లో ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. కొత్త ప్రాజెక్టులో ఇప్పుడున్న ధర కంటే ఎక్కువే చెబుతున్నారు. కట్టడం పూర్తి కావస్తున్న ఇళ్లను ఎంపిక చేసుకోవడం మేలు. కోవిడ్ ప్రభావం స్టీలు, సిమెంట్ ధరల మీద పడింది.. దాంతో ముందు ముందు ఇళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
రియల్టర్‌లకు ఆశాజనకంగా ఉన్న కొత్త ఏడాది.. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుండడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ అనంతరం మిగతా నగరాల కంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వేగంగా కోలుకుంది. ఇతర నగరాలతో పోలిస్తే ధరలు కూడా ఇక్కడ తక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
సిమెంటు, స్టీలు ధరలు నియంత్రణలో లేకపోవడంతో చదరపు అడుగు ధర రూ.300 వరకు పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇల్లు కొనే విషయంలో తొందరపడడం మంచిదని అంటున్నారు.
గృహ రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం ఇంటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది కోవిడ్ కారణంగా వాయిదా పడిన ప్రాజెక్టులన్నీ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాయి. సిటీ చుట్టూ పెద్ద ఎత్తున ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతోంది. బడ్జెట్‌ని బట్టి అపార్ట్‌మెంట్లు, విల్లాలు లభ్యమవుతున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద వడ్డీ రేటులో రాయితీ లభించడం ఊరటనిచ్చే అంశం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com