తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ఆగడంతో రూ. 900కోట్ల నష్టం..

తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ఆగడంతో రూ. 900కోట్ల నష్టం..

కరోనాతో రియల్ ఎస్టేట్ రంగం కుదైలైయింది. లాక్ డౌన్ కాలంలో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. అన్ లాక్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైన కరోనా భయంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. అన్ని గాడిలో పడే టైం కు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ పాలసీని తీసుకువచ్చే క్రమంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. దీంతో క్రయవిక్రయాలు నిలిచి పోవడంతో పాటు అవసరాల కోసం భూములు అమ్ముకునే వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన... నాన్ అగ్రికల్చర్ భూముల పరిస్థితి ఏంటి.. అనేది ప్రశ్న గా మారింది.

రాష్ట్రంలో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలను నిలిపివేసి రెండు నెలలైంది. గత నెల 29న ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ మరో 15 రోజుల్లో మొదలవుతుందన్నారు. కానీ ఇప్పట్లో నాన్ అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్ లు జరుగుతాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబరు 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలను నిలిపేశారు. ఆ తర్వాత కొత్త రెవెన్యూ యాక్టు తీసుకొచ్చారు. దీని ప్రకారం ధరణి వెబ్ సైట్ ఏర్పాటు చేశారు. ఆ పోర్టల్ లోని ఆస్తుల వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని ప్రకటించారు. అయితే... ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను మాత్రమే కొనసాగిస్తున్నారు.

రెండు నెలలుగా నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో దాదాపు లక్షకు పైగా సేల్​ డీడ్ లు నిలిచిపోయినట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు సగటున రెండువేల రిజిస్ట్రేషన్లు జరిగేవి. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఆస్తులను అమ్మడానికి,కొనడానికి వీలుకావడం లేదు. నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో ప్రభుత్వానికి దాదాపు రూ. 900 కోట్ల ఆదాయం నిలిచిపోయింది. ప్రతి నెల రూ. 450 కోట్ల ఆదాయం కేవలం రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చేది. ప్రస్తుతం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నా, వాటివల్ల ప్రభుత్వానికి అందే ఆదాయం తక్కువే... నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లతోనే పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. కానీ నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ లు ఇప్పట్లో గాడిన పడతాయో లేదోనన్న సందేహాలు జనాల్లో వ్యక్తం అవుతున్నాయి.

లాక్ డౌన్ వల్ల ప్రభుత్వ ఆదాయం ఘోరంగా దెబ్బతింది. మెల్లమెల్లగా కోలుకుంటున్న సమయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రభుత్వం కు ఆదాయం లేకపోగా .. ఇటు వ్యాపారులు, ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు రియల్టర్లు.

Tags

Read MoreRead Less
Next Story