Redmi K50i : మరో రెండ్రోజుల్లో మార్కెట్లోకి కొత్త రెడ్‌మీ.. ఫీచర్లు, ధర చూస్తే..

Redmi K50i : మరో రెండ్రోజుల్లో మార్కెట్లోకి కొత్త రెడ్‌మీ.. ఫీచర్లు, ధర చూస్తే..
Redmi K50i : షావోమి కంపెనీ వచ్చే జులై 20న ఒక కొత్త రెడ్‌మీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెడ్‌మీ కే 50ఐ పేరుతో వస్తున్న ఈ ఫోన్ 12 రకాల 5జీ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుందని తెలిసింది.

Redmi K50i : షావోమి కంపెనీ వచ్చే జులై 20న ఒక కొత్త రెడ్‌మీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెడ్‌మీ కే 50ఐ పేరుతో వస్తున్న ఈ ఫోన్ 12 రకాల 5జీ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుందని తెలిసింది.ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న తొలి రెడ్‌మీ ఫోన్ కూడా ఇదే కావడం విశేషం.

ఇప్పటికే 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని బ్యాండ్‌లను రిలయన్స్ జియో సంస్థతో కలిసి విజయవంతంగా పరీక్షించారు. 4కే స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్ వంటి టెస్ట్‌లన్నింటిని తట్టుకుని నిలబడింది అని సంస్థ తెలిపింది. దీంతో యూజర్లకు ఇకపై ఎలాంటి ఇబ్బంది వుండదు వీడియోగేమ్‌లు ఆడే సమయంలో కానీ, 8కే క్వాలిటీ వీడియోలను చూసేటప్పుడు కానీ అని సంస్థ పేర్కొంది.

మిడ్ రేంజ్ శ్రేణిలో రెడ్‌మీ ఈ ఫోన్‌ను తీసుకొస్తుంది. చాలా కాలంగా రెడ్‌మీ కంపెనీ K సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేయలేదు. అందుకే ఈ ఫోన్ కోసం టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 144 హెరక్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్‌హెచ్‌డీ + రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ ఆల్డ్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ కెమెరాలున్నాయి.

వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. 5,080 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎమ్‌ఐయూఐ 13 ఓఎస్‌తో పని చేస్తుంది. 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్, 8 జీబీ/256 జీబీ వేరియంట్లలో వస్తోంది. రెడ్‌మీ కే 50ఐ ధర రూ. 21 వేల నుంచి రూ. 25 వేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story