అంచనాలు మించిన లాభాలు అందుకున్న రిలయన్స్

అంచనాలు మించిన లాభాలు అందుకున్న రిలయన్స్

దేశీయ అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలతో ముగిసిన రెండో త్రైమాసికానికి ఫైనాన్షియల్ రిజల్ట్స్ విడుదల చేసింది. కరోనా కష్టంలో కూడా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రూ.9567 కోట్ల నికర లాభాన్ని గడించింది. వాస్తవానికి బ్లూమ్ బర్గ్ కూడా కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ.9,017 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. కానీ అంచనాలు దాటింది. అయితే గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే మాత్రం ప్రాఫిట్ 15.05శాతం తగ్గింది. ముఖ్యంగా గ్యాస్, ఆయిల్ కంపెనీల్లో ఆదాయం పడిపోయింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో కంపెనీ నెట్ ప్రాఫిట్ 11,262కోట్లు సాధించింది.

రిటైల్..

రిలయన్స్ రిటైల్ కంపెనీ రూ.41100 కోట్ల రెవిన్యూ సాధించినట్టు చూపించింది. అంతుకుముందు త్రైమాసికంలో ఇది కేవలం రూ.31,620 కోట్లు మాత్రమే. లాక్ డౌన్ సడలించడంతో కంపెనీల అమ్మకాలు పెరిగాయి. ఆపరేషనల్ లాభాలు EBTD రూ.2009 కోట్లు. గత ఏడాది ఇది 2330 కోట్లు. గత ఏడాదితో పోల్చితే 6.3శాతం నుంచి 5.4శాతానికి పడిపోయింది.

జియో...

ఇక రిలయన్స్ జియో నెట్ ప్రాఫిట్ రూ.2844కోట్లు. అంతకుముందు త్రైమాసికంలో ఇది 990 కోట్లు మాత్రమే. గత ఏడాది ఇదే కాలానికి జియో రెవిన్యూ 13,130 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.17,481 కోట్లకు పెరిగింది. యావరేజ్ రెవిన్యూ పర్ యూజర్ కూడా రూ.140 నుంచి రూ.145కు పెరిగింది.గత ఏడాది ఇది రూ.120 మాత్రమే.చైనా తర్వాత 40 కోట్లమంది యూజర్స్ ఉన్న ఏకైక టెలికం కంపెనీగా అవతరించింది జియో.

ఆయిల్ అండ్ గ్యాస్...

కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్ ఆదాయం క్రమంగా మెరుగుపడుతోంది. కంపెనీ నిర్వహణ ఆదాయం పెరిగింది. EBITDA గడిచిన త్రైమాసికంతో పోల్చితే 17.8శాతం పెరిగింది. అయినా గత ఏడాది కంపెనీ రెవిన్యూతో పోల్చితే 23శాతం తక్కవే ఉంది. గత ఏడాది 38,538 కోట్లకు పరిమితం అయింది. రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ విభాగంలో కంపెనీ ఆదాయం 33.3శాతం పెరిగి 62,154 కోట్లకు చేరింది. అయితే గత ఏడాది వచ్చిన రూ.97,229 కోట్ల కంటే తక్కువే.

Also Read: profit your trade


Tags

Read MoreRead Less
Next Story