7 కంపెనీలు... నెల రోజుల్లో రూ.32,197 కోట్ల పెట్టుబడులు

రిలయన్స్ రిటైల్‌కు క్రేజ్ పెరుగుతోంది. గత నెలరోజుల్లో 7 పెట్టుబడి సంస్థలు రూ.32,197.50 కోట్లను రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టాయి. సిల్వర్‌లేక్ పాట్నర్స్, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్‌లేక్ కో-ఇన్వెస్టర్స్, ముబదాలు ఇప్పటివరకు రిలయన్స్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేయగా, తాజాగా జీఐసీ, టీపీజీలు కూడా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో ఇప్పటివరకు రిలయన్స్ రిటైల్‌లో ఈ 7 సంస్థలు కలిపి 7.28శాతం వాటాను కొనుగోలు చేశాయి.
రిలయన్స్ కంపెనీలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుంది. జియా డిజిటల్ తర్వాత రిటైల్ పై ఫోకస్ చేసిన కంపెనీ.. వాటాలు విక్రయిస్తోంది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ GIC 5,512.5 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. అటు మరో కంపెనీ TPG కూడా 1837 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఇందులో భాగంగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లో GICకు 1.22శాతం, TPGకి 0.41శాతం దక్కనుంది. వాస్తవానికి TPG కంపెనీ రిలయన్స్ లో సెకండ్ ఇన్వెస్ట్ మెంట్ ఇది. గతంలో జియోలో రూ.4546 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇక ముందు కూడా మరికొన్ని కంపెనీలు రియలన్స్ రిటైల్ లో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. అమోజాన్ కూడా 20శాతం వాటా కొనుగోలు చేస్తుందిని తెలుస్తెంది. దీనికి సంబందించి చర్చలు జరుగుతున్నాయి. అయితే రెండు కంపెనీలు దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.. అలాగని ఖండించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com