గూగుల్ నుంచి జియో ప్లాట్‌ఫామ్స్‌కు సబ్‌స్క్రిప్షన్ నిధులు

గూగుల్ ఎల్‌ఎల్‌సీ అనుబంధ సంస్థ గూగుల్ ఇంటర్నేషనల్ ఎల్‌ఎల్‌ఎసీ నుంచి సబ్‌స్క్రిప్షన్ నిధులను పొందినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. అవసరమైన అన్ని ఆమోదాలు పొందిన తర్వాత రూ.33.737 కోట్ల నిధులను జియో ప్లాట్‌ఫామ్స్‌కు గూగుల్ చెల్లించింది. దీంతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.73 శాతం వాటాను పొందినట్లయింది. ఈ వాటాను సంబంధించిన షేర్ల కేటాయింపులను పూర్తి చేసినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.
ఇవాళ ప్రారంభంలో లాభాల్లో ట్రేడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రేడింగ్ ప్రారంభంలో రూ.1965.60కు చేరి డే గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ప్రస్తుతం అరశాతం పైగా నష్టంతో రూ.1939 వద్ద షేర్ ట్రేడవుతోంది. వరుస పెట్టుబడులతో గత త్రైమాసికంలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.2368.80కు చేరిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది.
ఇవాళ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి ఇప్పటివరకు 41.50 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12.57 లక్షల కోట్లుగా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈ 37.69 కాగా, కంపెనీ పీ/ఈ 44.17గా ఉంది. షేర్ బుక్ వేల్యూ రూ.679.38, ఈపీఎస్ రూ.44.16గా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com