రిలయన్స్ జియో అరుదైన రికార్డు..

Reliance Jio మరో ఘనత సొంతం చేసుకుంది. భారత టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అయిన రిలయెన్స్ జియో ప్రపంచవ్యాప్తంగా టాప్ బ్రాండ్స్‌లో ఒకటిగా నిలిచింది. యాపిల్, అమెజాన్, డిస్నీ, టెన్సెంట్, అలీబాబా లాంటి దిగ్గజ కంపెనీలని కూడా వెనక్కి నెట్టేసింది. రిలయెన్స్ జియో 5వ స్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ 500 ర్యాంకింగ్‌లో రిలయెన్స్ జియోకు ఈ ర్యాంకింగ్ ఇచ్చింది. మొదటి స్థాంలో వీచాట్ ఉంటే, రెండో స్థానంలో ఫెరారీ ఉంది. ఇక మూడో స్థానంలో రష్యాకు చెందిన Sber బ్యాంకు ఉండగా, సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కోకా కోలా నాలుగో స్థానంలో ఉంది. రిలయెన్స్
జియో ఐదో స్థానం.
మొదటిసారి ర్యాంకింగ్‌లోకి అడుగుపెట్టిన భారతీయ టెలికాం దిగ్గజం రిలయెన్స్ జియో. 91.7 బీఎస్ఐ స్కోర్‌తో ముందువరసలో నిలిచింది.2016లో ఏర్పాటైన జియో 41 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో భారతదేశంలో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా ఉంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com