ముఖేష్ అంబానీ ముందుచూపు.. కొత్తరంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ

ముఖేష్ అంబానీ ముందుచూపు.. కొత్తరంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ

ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ విద్యుత్ స్మార్ట్ మీటర్ విభాగంలోకి అడుగుపెడుతోంది. మీటర్ డేటా కలెక్షన్, కమ్యూనికేషన్ కార్డ్స్, టెలికం క్లౌడ్ హోస్టింగ్ సర్వీసెస్ అందించనుంది. డిస్కమ్ కంపెనీలకు అవసరమైన టెక్నాలజీ ఎక్విప్ మెంట్ ఈ కంపెనీ అందిస్తుంది.

రిలయన్స్ కంపెనీ ఇందులో అడుగుపెట్టడానికి ఓ కారణం ఉంది. డిస్కమ్ లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలు చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే విద్యుత్ సంస్కరణల్లో భాగంగా స్మార్ట్ మీటర్ ప్రోగ్రామ్ చేపట్టింది కేంద్రం. విద్యుత్ నష్టాలను తగ్గించుకోవడంతో పాటు.. ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న 25 కోట్ల మీటర్లను మార్పిడి చేయాల్సి ఉంది. ఇందులో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రిలయన్స్ కంపెనీ రంగంలో దిగింది. దీనిపై వేలకోట్ల ఆదాయం వస్తుంది.

అడ్వన్స్ డ్ మీటరింగ్ ఇన్ ఫ్రాస్రక్చర్ (AMI) వ్యాపారంలో భాగంగా సర్వీసులు అందిస్తుంది. నారో బాండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ NB-IoT ద్వారా టూ వే కమ్యూనికేషన్ సర్వీసెస్ ఇవ్వనుంది.

ఇప్పటికే కంపెనీ టెలికం రంగంలో 40 కోట్ల మందికి పైగా కస్టమర్లకు సేవలు అందిస్తూ ప్రపంచంలోనే టాప్ కంపెనీల్లో ఒకటిగా ఉంది. ఇక రిటైల్ రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించింది. ఇప్పుడు ప్రజలకు నేరుగా అవసరమైన విద్యుత్ సరఫరాలోకి అడుగుపెడుతోంది. అంటే ప్రజలతో టచ్ లో ఉండే వ్యాపారంలోకి వచ్చి వారికి మరింత చేరువ అయ్యే ప్రయత్నంలో ఉంది. దీని ద్వారా కంపెనీకి మూడు లాభాలు.. ఇప్పటికే యాప్ ఉంది. కరెంట్ మీటర్లు కూడా వారి చేతిలో ఉంటే.. చెల్లింపులు తమ యాప్ ద్వారా జరుగుతాయి. దీంతో కంపెనీకి ఉభయతారకంగా ఉంటుంది. ఏమైనా ముఖేష్ అంబానీ ముందుచూపు కంపెనీ ఎదుగుదలలో కీలకంగా మారుతోంది.

Tags

Read MoreRead Less
Next Story