రిలయన్స్ కు మరో జాక్ పాట్!

రిలయన్స్ కు మరో జాక్ పాట్!
రిలయన్స్, బీపీ కీలక ప్రకటన చేశాయి. కేజీ డి6 బేసిన్ లోని ఆర్ క్లస్టర్ నుంచి గ్యాస్ వెలికి తీసేందుకు సంయుక్తంగా పనిచేయనున్నట్టు ప్రకటించాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక ఘట్టానికి చేరువైంది. కృష్ణా గోదావరి బేసిన్ లో అత్యంత లోతైన ఆర్ క్లస్టర్ నుంచి గ్యాస్ ను వెలికి తీసేందుకు సిద్ధమవుతోంది. ఆసియాలో ఇదే అతి లోతైన ఆఫ్ షోర్ ప్రాజెక్ట్. సుమారు 2వేల మీటర్ల లోతు నుంచి గ్యాస్ ని వెలికి తీయాల్సి ఉంటుంది. 2021లో రోజుకు 12.9 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల చొప్పున ఉత్పత్తి చేసే సత్తా కలిగి ఉంటుంది.

రిలయన్స్, బీపీ కీలక ప్రకటన చేశాయి. కేజీ డి6 బేసిన్ లోని ఆర్ క్లస్టర్ నుంచి గ్యాస్ వెలికి తీసేందుకు సంయుక్తంగా పనిచేయనున్నట్టు రెండు సంస్థలు ప్రకటించాయి. రెండు సంస్థలు కలిసి 3 క్షేత్రాల నుంచి గ్యాస్ వెలికి తీయాలని నిర్ణయించగా.. ఆర్ క్లస్టర్ అందులో మొదటిది. శాటిలైట్స్ క్లస్టర్, MJ క్లస్టర్ నుంచి కూడా తర్వాత దశల్లో గ్యాస్ ను వెలికి తీయనున్నాయి. 2023 నాటికి భారత్ లోని 15శాతం గ్యాస్ అవసరాలను ఈ క్షేత్రాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నట్టు రెండు సంస్థలు ప్రకటించాయి.. KG బేసిన్ లో రిలయెన్స్ కు 66.67శాతం, BPకి 33.33శాతం వాటా కలిగి ఉన్నాయి.

అత్యంత క్లిష్టమయిన భౌగోళిక పరిస్థితులు ఉండే కేజీ బేసిన్ నుంచి గ్యాస్ ను వెలికి తీసేందుకు BPతో కలిసి పని చేస్తుండడం సంతోషంగా ఉందని రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. పెరుగుతున్న భారతీయ అవసరాలను రెండు కంపెనీలు కలిసి తీరుస్తాయనే నమ్మకాన్ని వెలిబుచ్చారు BP సీఈఓ బెర్నార్డ్ లూనే.

శాటిలైట్ క్లస్టర్ 2021లో, MJ క్లస్టర్ 2022లో అందుబాటులోకి వస్తుందని అంచనా వసే్తున్నారు. ఈ మూడు క్షేత్రాల నుంచి ఉత్పత్తి మొదలైతే రోజుకు 30 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల చొప్పున వెలికి తీయవచ్చని ఆశిస్తున్నారు. అదే జరిగితే 25 శాతం దేశీయ అవసరాలను తీర్చవచ్చని భావిస్తున్నారు. అప్పుడు చమురుకోసం విదేశాలపై ఆధారపడడం భారీగా తగ్గుతుంది.

Tags

Read MoreRead Less
Next Story