బుల్లెట్ బైక్ కావాలంటే రూ.15000 కడితే సరి.. సంక్రాంతి స్పెషల్

బుల్లెట్ బైక్ కావాలంటే రూ.15000 కడితే సరి.. సంక్రాంతి స్పెషల్
అదే క్లాసిక్ బైక్ అయితే డౌన్ పేమెంట్ రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది.

బైక్ ప్రియులకు శుభవార్త. సంక్రాంతి పండక్కి కొత్త బైక్ కొనాలనుకుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ రాయితీలు ప్రకటించింది. తక్కువ డౌన్‌పేమెంట్‌ చెల్లించి బైక్ ఇంటికి తీసుకెళ్లవచ్చని చెబుతోంది.

వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ప్రకారం.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనేందుకు రూ.15000 డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది. అదే క్లాసిక్ బైక్ అయితే డౌన్ పేమెంట్ రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది.

బైక్ కొనుగోలుకు రుణం తీసుకున్న మొత్తాన్ని అయిదేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లోనే ఫైనాన్స్ ఆప్షన్ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, టాటా క్యాపిటల్ వంటి వాటి నుంచి లోన్ పొందొచ్చు. రూ.15000లు డౌన్ పేమెంట్ కట్టినట్లైతే ఇంకా రూ.1.37 లక్షలు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. లోన్ మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేయదలిస్తే నెలకు రూ.5000 ఈఎమ్‌ఐ కట్టాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story