రాయల్‌ లుక్స్‌లో రాయల్ ఎన్‌ ఫీల్డ్.. మూడు వేరియంట్లలో.. ఫీచర్లు, ధర చూస్తే..

రాయల్‌ లుక్స్‌లో రాయల్ ఎన్‌ ఫీల్డ్.. మూడు వేరియంట్లలో.. ఫీచర్లు, ధర చూస్తే..
ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది. మూడేళ్ల వారంటీతో పాటు సరికొత్త ఫీచర్లు,

టూ వీలర్ బైక్స్‌లో రాయల్ ఎన్ ఫీల్డ్ లుక్కే వేరు.. తాజాగా ఈ సంస్థ నుంచి 350 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది సంస్థ. కొత్తగా మరో మూడు వేరియంట్లను సంస్థ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అవి ఫైర్ బాల్, స్టెల్లార్, సూపర్ నోవా. ఇక ధర విషయానికి వస్తే ఫైర్ బాల్ వేరియంట్.. రూ.1.75 లక్షలు, సూపర్ నోవా వేరియంట్.. రూ.1.81 లక్షలు, స్టెల్లార్ వేరియంట్.. రూ.1.90 లక్షలు. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది. మూడేళ్ల వారంటీతో పాటు సరికొత్త ఫీచర్లు, ఎక్విప్‌మెంట్‌తో అందుబాటులోకి వచ్చింది.

ఇంజన్..

ఈ బైక్ 349 సీసీ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఎస్‌ఓహెచ్‌సీ ఇంజన్‌ను కలిగి ఉండి 6100 ఆర్సీఎం వద్ద 20.2 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 4000 ఆర్సీఎం వద్ద 27 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది.

ఈ మోటార్ సైకిల్ ఆల్ న్యూ డబుల్ క్రాడిల్ ఫ్రేమ్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ 650 సీసీ ఇంజన్ మాదిరి ఉంది. సరికొత్త ఛేసిస్ రిజిడ్ స్టేబుల్ ఆఫరింగ్ ఎన్హాన్సెడ్ హ్యాండ్లింగ్ ఎబిలిటీలతో ఎన్వీహెచ్ లెవల్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మోటార్ సైకిల్ సస్పెన్షన్ డ్యూటీస్ 41 ఎంఎం టెలిస్కోపిక్ యూనిట్, 130 ఎంఎం ట్రావెల్, ట్విన్ షాక్ సెటప్‌తో పాటు 6-స్టెప్ అడ్జస్టబిలిటి ప్రీలోడ్ వంటి ఫీచర్లతో కన్వెన్షనల్ బాక్ సింగ్రామ్‌ను కలిగి ఉంది.

ఇక ఈ బండి ప్రత్యేకతలు చూస్తే..

300 ఎంఎం డిస్క్ బ్రేక్‌తో పాటు టూ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్ ఫ్రంట్, 260 ఎంఎ డిస్క్ బ్రేక్ సింగిల్ పిస్టన్ రియర్‌ను కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ 19 అంగుళాల, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు డ్యూబ్ లెస్ టైర్లు సెక్షన్ 100/90, 140/70 ఫ్రంట్ అండ్ రియర్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మోటార్ సైకిల్ డ్యూయల్ ఛానెల్ ఏబీఎన్‌ను కలిగి ఉంది.

ఫీచర్లు..

వీటితో పాటు రెట్రో లుక్‌తో ఉండి మోడ్రన్ టచ్‌తో అందుబాటులో వచ్చింది. ఈ మోటార్ సైకిల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఎల్‌ఈడీ బెయిల్ ల్యాంపులు, హోలోజెన్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్లు ఉన్నాయి. అంతేకాకుండా 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంకుతో పాటు రెయిజ్డ్ వైడ్ హ్యాండిల్ బార్లు, ఫార్వార్డ్ సెట్ ఫుట్ పెగ్స్, వెల్ క్యూషెన్డ్ పిల్లియన్ బ్యాక్ రెస్ట్ ను కలిగి ఉంది. ఈ సరికొత్త బైక్ కనెక్టెడ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, గూగుల్ మ్యాప్స్‌తో టిప్పర్ నేవిగేషన్ టెక్నాలజీని ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా ఈ సరికొత్త మీటియోర్ 350 మోటార్ సైకిల్లో ట్విన్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిజైన్, మెయిన్ యూనిట్‌తో అనలాగ్ స్పీడ్ రీడింగ్ స్మాల్ డిజిటల్ డిస్ ప్లేతో హోస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ను కలిగి ఉంది. వీటిలో గేర్ ఇండికేటర్స్ ఓడిఓ, త్రీ ట్రిప్ రీడింగ్స్, క్లాక్, ప్యూయల్ ఇండికేటర్, సర్వీస్ రీమైండర్, ఎకో ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కలర్డ్ టీఎప్డీ డిస్ ప్లే, యూఎస్బీ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంది.

Tags

Next Story