Royal Enfield Scram 411: సరికొత్తగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌.. ఫీచర్లు, ధర చూస్తే..

Royal Enfield Scram 411: సరికొత్తగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌.. ఫీచర్లు, ధర చూస్తే..
Royal Enfield Scram 411: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు భారతదేశంలో మరిన్ని అడ్వెంచర్ ఫోకస్డ్ మోడల్‌లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Royal Enfield Scram 411: సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 యెజ్డీ స్క్రాంబ్లర్, హోండా CB350RS వంటి ప్రత్యర్థులతో పోటీపడుతుంది. హిమాలయన్ అడ్వెంచర్ విజయంతో ప్రేరణ పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు భారతదేశంలో మరిన్ని అడ్వెంచర్ ఫోకస్డ్ మోడల్‌లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దానిలో భాగంగానే Scram 411 ని తీసుకువచ్చింది.

కొత్త స్టాండర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, చిన్న ఫ్రంట్ వీల్, బేసిక్ బాడీ ప్యానెల్‌లతో సహా అందించబడింది. ఇది వైట్, సిల్వర్, బ్లాక్, బ్లూ. రెడ్, ఎల్లో వంటి అనేక రంగులలో వస్తోంది. కలర్ ని బట్టి స్క్రామ్ 411 ధరలు రూ.2,03,085 - 2,08,593 శ్రేణిలో ఉన్నాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ ఎల్ ఎస్ -410 ఇంజిన్ ప్లాట్ ఫామ్ పై ఈ బైక్ ను తయారు చేశారు.

ఈ సరికొత్త బైక్ పట్టణ రహదారులపైనే కాక, కఠిన మార్గాల్లోనూ శులభంగా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 411 సీసీ, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 6500 ఆర్ పీఎం వద్ద 24.3 బీహెచ్ పీ శక్తిని ఇస్తుందని, గరిష్ట టార్క్ 32 ఎన్ఎం అని వివరించింది. డిజిటల్ స్క్రీన్ పై ఆటో మీటర్, ట్రిప్ మీటర్, టైమ్, ఫ్యూయల్ గేజ్, సర్వీస్ రిమైండర్ వంటి సంకేతాలు, ముందు వెనుక డిస్క్ బ్రేక్ లు, డ్యూయల్-ఛానెల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story