Satya Nadella: జైన్‌కు ఉన్న ఆరోగ్య సమస్య గురించి బయటపెట్టిన సత్య నాదెళ్ల..

Satya Nadella: ఇండియాలో పుట్టి, పెరిగి టెక్ వరల్డ్‌నే ఏలేస్తున్న మైక్రోసాఫ్ట్‌కు సీఈఓగా ఎదిగారు సత్య నాదెళ్ల. ఈయన జీవితం ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్. అప్పటివరకు ఎంతోమంది భారతీయులు అమెరికాకు వెళ్లారు. అలాంటి వారందరికీ ఏదైనా సాధించవచ్చని స్ఫూర్తినిచ్చిన వారిలో సత్య నాదెళ్ల కూడా ఒకరు. అలాంటి సత్య నాదెళ్ల తన కొడుకు జైన్‌ను కోల్పోయి తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. అయితే జైన్ గురించి సత్య నాదెళ్ల.. ఆయన ఆటోబయోగ్రాఫిలో కొన్ని ఆసక్తికర విషయాలను రాశారు.
భారత్ నుండి అమెరికాకు వెళ్లిన సత్య నాదెళ్ల.. అక్కడే ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న మరో ఇండియన్ అనుపమను పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి తర్వాత అనుపమ మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు వారి మనస్తత్వం ఎలా ఉందో, వారిద్దరు ఎంత సంతోషంగా భవిష్యత్తును ఊహించుకున్నారో అన్న విషయాలను సత్య నాదెళ్ల తన ఆటోబయోగ్రాఫి 'హిట్ రీఫ్రెష్'లో స్పష్టంగా వివరించారు.
డెలివరి సమయం దగ్గర పడిన తర్వాత బిడ్డలో పెద్దగా కదలికలు లేవని అనుపమ గుర్తించారట. అందుకే ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారట సత్య నాదెళ్ల. అయితే వైద్యులు వెంటనే సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీశారట. అలా తమకు పుట్టిన మొదటి బిడ్డే జైన్. జైన్ కేవలం కిలోన్నర బరువుతోనే పుట్టాడట. అంతే కాకుండా పుట్టిన తర్వాత జైన్ ఏడవలేదట. అందుకే సత్య నాదెళ్ల తనను ఓ చిల్డ్రన్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లాడట.
రెండు, మూడేళ్ల వరకు జైన్ పూర్తిగా ఆసుపత్రిలోనే ఉన్నాడట. అప్పుడే వారికి జైన్‌కు 'సెరెబ్రల్ పాల్సీ' అనే వ్యాధి ఉందని తెలిసిందట. అంతే కాకుండా ఈ వ్యాధి ఉన్నవారు జీవితాంతం వీల్ ఛైర్‌కే పరిమితం అవ్వాలి, అంతే కాకుండా ఏ పని చేయాలన్నా తల్లిదండ్రులపైనే ఆధారపడాలి అని తెలుసుకున్న అనుపమ, సత్య నాదెళ్ల చాలా బాధకు లోనయ్యారట. గర్భంలో ఉన్నప్పుడు ఊపిరి సరిగ్గా అందకపోవడం వల్లే జైన్‌కు ఈ సమస్య వచ్చిందని వైద్యులు తెలిపారని పుస్తకంలో రాశారు సత్య నాదెళ్ల.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com