SBI Credit Card Offer: ఎస్‌బీఐ కార్డ్.. పండుగ ఆఫర్లు..

SBI Credit Card Offer: ఎస్‌బీఐ కార్డ్ మూడు రోజుల పండుగ ఆఫర్లను ప్రకటించింది. అక్టోబరులో అన్ని దేశీయ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారాలపై తమ క్రెడిట్‌కార్డు ద్వారా చేసే కొనుగోళ్లకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను అందజేయనున్నట్లు తెలిపింది. 'ధమ్‌దార్ దస్' పేరిట దీనిని నిర్వహిస్తోంది. ఈ మూడు రోజుల మెగా షాపింగ్ పండుగ ఆఫర్ అక్టోబరు 3 నుంచి ప్రారంభమవుతుంది. వినియోగదారులు తమ కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చని ఎస్‌బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ రామ్మోహన్ రావు అమర పేర్కొన్నారు.
ఆన్‌లైన్ మర్చంట్ ఈఎమ్‌ఐ లావాదేవీలపైనా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలు, టీవీలు, భారీ గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఫర్నీచరు, వంటగది ఉపకరణాలు, ఫిట్‌నెస్ ఉత్పత్తుల కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ వర్తిస్తుందని తెలిపింది. భీమా, ప్రయాణాలు, వాలెట్, ఆభరణాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, యుటిలిటీ మర్చంట్లకు చేసే ఆన్‌లైన్ వ్యయాలపై ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com