ఇక నుంచి ఈ యాప్‌ ద్వారా సులభంగా లోన్లు

ఇక నుంచి ఈ యాప్‌ ద్వారా సులభంగా లోన్లు

చిన్నస్థాయి రిటైలర్లు మరింత సులువుగా రుణాలను పొందేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హెచ్‌యూఎల్‌తో బ్యాంకింగ్‌ మేజర్‌ ఎస్‌బీఐ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. తాజా ఒప్పందంతో హెచ్‌యూఎల్‌కు చెందిన శిఖర్‌ యాప్‌ను వినియోగించే రిటైలర్లు ఇక నుంచి ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా సులువుగా రుణాలను పొందొచ్చు. కాగితం అవసరం లేకుండానే సులభమైన పద్ధతిలో చాలా త్వరగా రుణాలను పొందవచ్చని, ఇప్పటివరకు రిటైలర్లు ఎదుర్కొంటున్న రుణ సమస్యలకు ఇది సరైన పరిష్కారమని హెచ్‌యూఎల్‌ వెల్లడించింది. తమ వద్ద రిజిస్టర్‌ అయిన రిటైలర్లకు 50వేల రూపాయల వరకు ఓవర్‌ డ్రాప్ట్‌ సదుపాయాన్ని కల్పించనున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story