SBIకి షాకిచ్చిన కస్టమర్లు!

SBIకి షాకిచ్చిన కస్టమర్లు!

SBI కస్టమర్లు విసిగిపోయారు.. ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తమ అస్త్రాన్ని ప్రయోగించారు. అదే సోషల్ మీడియా. దీనికి లొంగని వాళ్లుంటారా? యూత్ కు అతిపెద్ద ఆయుధం అయిన సోషల్ మీడియా వేదికగా బ్యాంకు పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బండ బూతులు తిట్టారు. అసలు అకౌంట్లు కూడా క్లోజ్ చేస్తున్నట్టు కొందరు ప్రకటించారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకు ట్వీట్ లో సారీ చెప్పింది. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? గత కొద్దిరోజులుగా SBI నెట్ బ్యాంకింగ్ సరిగా పనిచేయడం లేదు. IMPS, NEFT కూడా పనిచేయడం లేదు. దీంతో యూజర్లు విసిగిపోయారు. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే ఆన్ లైన్ బ్యాంకింగ్ సపోర్ట్ సిస్టమ్ అప్ గ్రేడ్ చేస్తున్నామని.. కస్టమర్లు అర్థం చేసుకోవాలని ట్వీట్ చేసింది.

ఇక ఇవాళ ఎస్‌బీఐ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ఇవాళ లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఇంట్రాడేలో రూ.246.55కు పడిపోయి నష్టాల్లోకి జారుకున్న ఎస్‌బీఐ, ప్రస్తుతం స్వల్ప లాభంతో రూ.248.30 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో ఈషేర్‌ రూ.250.25కు చేరింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి ఇవాళ ఇప్పటివరకు 1.54 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,21,374.99 కోట్లకు చేరింది. ఇండస్ట్రీ పీ/ఈ 17.84 ఉండగా కంపెనీ పీ/ఈ 12.35గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.233.34, ఈపీఎస్‌ రూ.20.09గా ఉన్నాయి.

Also Read:profit your trade


Tags

Read MoreRead Less
Next Story