ఎస్‌బీఐ ఖాతాదారులకు గమనిక.. వెంటనే ఫీచర్..

SBI YONO Lite

SBI YONO Lite

SBI YONO Lite: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.

SBI YONO Lite: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల సౌకర్యార్థం ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ మరింత సురక్షితం చేసేందుకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. సైబర్ నేరగాళ్ల ఖాతాదారుల నుంచి లక్షలు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు అడ్డుకునేందుకు బ్యాంకులు తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి. యోనో లైట్ యాప్‌లో కొత్త ఫీచర్ ను పరిచయం చేస్తుంది ఎస్‌బీఐ. యోనో లైట్ యాప్‌లో సిమ్ బైండింగ్ ఫీచర్‌ను రూపొందించింది. యోనో లైట్ యాప్ లేటెస్ట్ వర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఇక సురక్షితమని, యోనో యాప్ స్మార్ట్ ఫోన్ యూజర్లు డౌన్ లోడ్ చేసుకోవాలని SBI తమ కస్టమర్లను కోరుతోంది. యోనో లైట్ యాప్ 5.3.48 వర్షన్‌లో సిమ్ బైండింగ్ ఫీచర్ ఉంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ ఫీచర్ యాక్టివేట్ చేయొచ్చు. సిమ్ బైండింగ్ టెక్నాలజీతో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సిమ్ కార్డ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లోనే బ్యాంకింగ్ యాప్ ఉపయోగించుకోవచ్చు. కస్టమర్ల స్మార్ట్‌ఫోన్‌లో ఎస్‌బీఐ యోనో లైట్ యాప్ అప్‌డేట్ చేయండి. లేదా, యాప్‌ కొత్తగా ఇన్‌స్టాల్ చేయాలి.


*ఎస్‌బీఐ యోనో లైట్ యాప్

-యాప్ ఓపెన్ చేసిన తర్వాత SIM(1,2) సెలక్షన్ ఆప్షన్ వస్తుంది.

-మీ ఎస్‌బీఐ ఖాతాకు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో.. ఆ స్లాట్ సెలెక్ట్ చేయండి.

-మొబైల్ నెంబర్ వేలిడేషన్ కోసం.. మీ ఫోన్ నుంచి ఓ SMS పంపాలి.

-ఇక దాని కోసం Proceed పైన క్లిక్ చేయాలి.

-యూనిక్ కోడ్‌తో SMS వెళ్తుంది.

-వెరిఫికేషన్ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ స్క్రీన్ కనిపిస్తుంది.

-అందులో USER Name, Possword ఎంటర్ చేయాలి.

-Register పైన క్లిక్ చేయాలి.

-రిజిస్ట్రేషన్ రూల్స్ అంగీకరించి Term and Conditions క్లిక్ చేయాలి.

-OK ఫైన ఎంటర్ చేయాలి

-మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కు యాక్టివేషన్ కోడ్ వస్తుంది.

-30 నిమిషాలు మాత్రమే ఆ కోడ్ పనిచేస్తుంది.

-కోడ్ ఎంటర్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి.

-దీంతో Process కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఎప్పటిలాగే యోనో లైట్ యాప్ వాడొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story