Paytm ఉందా.. అయితే క్షణాల్లో IPO అప్లికేషన్ అండ్ పేమెంట్

Paytm పేమెంట్ బ్యాంక్ సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇక మీదట ఐపీఓ అప్లికేషన్స్ కు తమ UPI ద్వారా పేమెంట్ చేయడానికి SEBI అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. ఇప్పటికే ఈక్విటీ మార్కెట్లో ప్రవేశించింది. Paytm మనీ కోటి మంది ఇండియన్స్ ను 2022 నాటికి తమ కంపెనీ ద్వారా ఈక్విటీ మార్కెట్లోకి తీసుకరావడమే లక్ష్యంగా పెట్టుకుంది.
By enabling @paytm UPI to Apply IPO ద్వారా ఈ ఆప్షన్ వినియోగించుకోవచ్చు. అతితక్కువ సమయంలో సురక్షితమైన పేమెంట్ ఆప్షన్ అంటోంది సంస్థ. దేశీయంగా IPOలు పెరుగుతున్నాయి. మార్కెట్లో ప్రైమరీ మార్కెట్ నుంచి నిధుల సమీకరణకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యులకు కూడా అందుబాటులో ఇందులో పార్టిసిపేట్ చేసే సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి పేటీఎమ్ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ ఫాం ద్వారా 3.5లక్షల ఖాతాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 60శాతం వరకూ స్మాల్ సిటీల్లోనే ఉంటాయని అంచనా.
అంతేకాదు.. అన్ని బ్రోకరేజ్ సంస్థలతోనూ పేటీఎం ఒప్పందం దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఇక మీదట స్టాక్ మార్కెట్లో ఏ సంస్థ ద్వారా ఇన్వెస్ట్ చేసినా పేమెంట్ మాత్రం Paytm ద్వారా చేసే వెసులుబాటు ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com