పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన స్థితి అంటే ఇదే.. పుట్టెడు కష్టాల్లో బిలియనీర్

పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన స్థితి అంటే ఇదే.. పుట్టెడు కష్టాల్లో బిలియనీర్
సినిమా కష్టాలు అంటే ఇవే.. అన్ని ఒకేసారి వచ్చిపడుతుంటాయి.

కొంతకాలం వరకూ ఆయన దేశంలోనే బిలియనీర్లలో ఒకడిగా ఉన్నారు. ఫ్యూచర్ గ్రూపు ఎండీగా బిగ్ బజార్ సంస్థల అధిపతిగా అందరికీ తెలిసిన గొప్ప వ్యాపారవేత్త. కానీ అనూహ్యంగా వరుస కష్టాలు చుట్టుముట్టాయి. ఆస్తులు కరిగిపోతున్నాయి.. కంపెనీలు పోయాయి.. కనీసం ట్రేడింగ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.

కంపెనీ అమ్మాల్సి వచ్చింది. అయినా కష్టాలు తీరలేదు.. సెబీ కూడా తాజాగా నిషేధం విధించింది. ఇన్ని సమస్యలు చుట్టుముట్టాయి కిషోర్ బియానీని.

కిషోర్ బియానీకి కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. కరోనా దెబ్బకు తట్టుకోలేక కంపెనీని అమ్మకానికి పెట్టారు. రిలయన్స్ భారీ ఆఫర్ ఇవ్వడంతో అమ్మేశారు. అయితే ఈ డీల్ కూడా ఇంకా వివాదంలోనే ఉంది. అమోజాన్ కంపెనీ అడ్డం తిరగడంతో కేసు కోర్టుకు చేరింది. దీంతో డబ్బు చేతికి అందడం లేదు.. అప్పులు తీరడం లేదు.

ఇప్పుడు మార్కెట్టలో కూడా సెబీ నిషేధం విధించింది. బియానీతో పాటు.. ఆయన కుటుంబసభ్యులు, సంస్థలను సెక్యూరిటీ మార్కెట్లోకి ఒక సంవత్సరం పాటు యాక్సెస్ చేయకుండా నిరోధించింది నియంత్రణ సంస్థ. ఫుల్ టైం సెబీ సభ్యులు అనంత్ బారువా తాజాగా ఈ ఉత్తర్వులు ఇచ్చారు.

ఫ్యూచర్ గ్రూపులోని కొన్ని కంపెనీలను 2017లో పునర్వ్యవస్థీకరించిన సమయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ వివాదంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా తాజాగా తీర్పు వెలువరించింది. సెక్యూరిటీలను రెండేళ్లపాటు కొనలేరు, అమ్మలేరు. అంతేకాదు.. రూ. 20.53 కోట్ల రూపాయల మొత్తాన్ని అక్రమ పద్దతుల్లో ఆర్జించినట్టు తెలిపింది సెబీ. అందుకే మార్కెట్ లో నిషేధంతో పాటు.. వారికి రూ. 3.7 కోట్లు పెనాల్టీ కూడా విధించింది.

సినిమా కష్టాలు అంటే ఇవే.. అన్ని ఒకేసారి వచ్చిపడుతుంటాయి. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్తగా పేరొందని కిషోర్ బియానీ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

Also Read:profit your trade


Tags

Read MoreRead Less
Next Story